వ్యాక్సిన్ వేసుకున్నారా...నిభందనలు సడలించిన అమెరికా..!!

అమెరికా అద్యక్షుడు జో బిడెన్ కరోనా మహమ్మారి పై భారీ యుద్దాన్ని చేపట్టారు.అధికారంలోకి రాగానే తన మొదటి కర్తవ్యం కరోనానును తరిమి కొట్టడమేనని చెప్పిన బిడెన్ ఆ దిశగా అడుగులు వేస్తూ సక్సెస్ అవుతున్నారు.

 Have You Been Vaccinated America Has Relaxed The Rules, Amrica, Corona Vaccine,-TeluguStop.com

కరోనా వ్యాక్సిన్ తమ దేశ ప్రజలకు పంపిణీ చేయడంలో రికార్డ్ క్రియేట్ చేసిన బిడెన్ అనుకున్న విధంగానే దాదాపు 55 శాతం మంది అమెరికన్స్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.అయితే అమెరికాలో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి అమెరికా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గుడ్ న్యూస్ ప్రకటించింది.

అమెరికా అధ్యక్షుడు బిడెన్ కరోనా నుంచీ తమను తాము కాపాడుకోవడానికి మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని నిభందనలు అమలు లోకి తీసుకువచ్చారు.అయితే కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాస్క్ ధరించాల్సిన అవసరం ఏ మాత్ర్రం లేదని తేల్చి చెప్పారు.

అయితే బహిరంగ మీరు వెళ్ళినపుడు వ్యాక్సిన్ మీరు తీసుకున్నా అక్కడ మాస్క్ ధరించాల్సిందేనని సూచించారు.అమెరికా వ్యాప్తంగా ఉన్న జనాభా మొత్తానికి వ్యాక్సిన్ పూర్తిగా అందించలేదని ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాలలో తప్పకుండా మాస్క్ ధరించాలాని కోరారు.

అమెరికాలో ఇప్పటి వరకూ కరోనా మొదటి తీసుకున్న వాళ్ళు 18 శాతం ఉండగా వారిలో రెండవ డోస్ తీసుకున్న వారిలో 9.2 శాతం మంది మాత్రమే ఉన్నారని, కేవలం రెండవ డోస్ తీసుకున్న వారు మాత్రమే ఇండోర్ ప్రదేశాలలో మాస్క్ లేకుండా సంచరించ వచ్చని , సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని సిడీసి తెలిపింది.కాగా ఇప్పటి వరకూ అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 30 లక్షలకు చేరువలో ఉండగా, ఈ మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య దాదాపు 5.38 లక్షలకు చేరువ అయ్యింది.అయితే బిడెన్ కరోనా రక్షణ చర్యలు చేపట్టిన నాటి నుంచీ కేసుల సంఖ్య,మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని అంటున్నారు వైద్య నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube