కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్‌ మార్వెల్ అయ్యిందా?

కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం తొందరపడిందని, దాని ప్రయోజనం కన్న ఆర్థిక భారమే రాష్ట్రానికి మోయలేని బరువు అవుతుందని, ఇటీవల వరదల్లో ప్రాజెక్టు పంపులు మునిగిన నేపథ్యంలో లక్షల కోట్ల ధనాన్ని నీటిలో పోసినట్లు అయ్యిందని విమర్శలు వినడం సర్వసాధారణం అయ్యింది.

గతంలో ప్రాజెక్టు పూర్తి చేసి నీటిని ఎత్తి పోస్తూ గ్రామగ్రామాన చెరువులు కుంటలు నింపడంతో ప్రజలు, నిపుణులు ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతమైందని, ప్రపంచంలోనే ఒక విలక్షణ ప్రాజెక్టు అని కొనియాడడం, ప్రాజెక్టును దర్శించి ఆశ్చర్యానికి, ఆనందానికి గురికావడం చూసాం.

పలు ప్రభుత్వ సంస్థలు అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రశంసించడమే కాకుండా ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలు కోట్ల రూపాయల రుణాలను ఇవ్వడం జరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకాకిని చేసి విఫల ప్రాజెక్టును రూపొందించిందంటూ ముప్పేట దాడి చేయడం సమంజసంగా కనిపించుట లేదు.ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన అప్పులకు ఏడాదికి 8.25 నుంచి 10.9 శాతం వరకు భారీ వడ్డీలను చెల్లించాల్సి వస్తున్నదని వాపోవడం సమంజసంగానే కనిపిస్తున్నది.డిపిఆర్‌ లేకుండా, నిపుణుల సలహాలను పెడచెవిన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని, నీటిని పలు దశల్లో ఎత్తి పోయడానికి విద్యుత్తు ఖర్చులు భారీగా ఉంటాయని, దీర్ఘకాలికంగా దీని నీటిని సాగుకు వినియోగించడం ఆర్థికంగా సాధ్యపడక పోవచ్చనే మాటలు వింటున్నాం.తొలి దశలో 40 వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన ప్రాజెక్టు వ్యయం 1.4 లక్షల కోట్లకు ఎగబాకిందని వింటున్నాం.ఇటీవల కేంద్ర మంత్రులు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు చట్టపరమైన అనుమతులు లేవని, ప్రాజెక్టు డిజైన్‌లో నిపుణుల సలహాలు తీసుకోలేదని, దీనిలోని లోపాల మూలంగా ఇటీవలి భారీ వర్షాలకు మునిగి పోయిందని విమర్శించడం మనకు ఇంకా గుర్తుంది.ప్రారంభం నుండి పలు వివాదాలను ఎదుర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి వెచ్చించిన భారీ పెట్టుబడులకు, పరిమిత ప్రయోజనాలకు మధ్య అనంత అంతరం ఉందనే మాటలను వింటున్నాం.2014కు పూర్వం నాటి కాంగ్రేస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల ప్రాజెక్టు’ ప్రణాళికలు మార్చి నేటి టిఆర్‌యస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పథక రచన చేసి అతి తక్కువ కాలంలో అత్యధిక పెట్టుబడులతో దాదాపు పూర్తి చేసింది.నేటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రుణాలు తీసుకోవడానికి “కాళేశ్వరం సాగు నీటి ప్రాజెక్టు కార్పొరేషన్” ఏర్పాటు చేయడంతో ఈ రుణాలు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ పరిధిలోకి రాకుండా జాగ్రత్త పడింది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 15 దశల్లో 6 ఆర్థిక సంస్థలు రూ: 97,449.16 కోట్ల రుణాలు అందజేశాయని సమాచార హక్కు చట్టం ప్రయోగించి సేకరించిన వివరాలు తెలుపుతున్నాయి.వీటిలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి రూ: 11,400 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ: 7,400 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ: 2,150 కోట్లు, రూరల్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ నుంచి రూ: 30,536 కోట్లు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ నుంచి రూ: 37,737 కోట్లు, నాబార్డ్‌ నుంచి రూ: 8,225 కోట్లు రుణాలుగా తీసుకోవడం జరిగింది.ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు కల్పించడం విశేషంగా గమనించాలి.ఈ రుణాలకు సాలీనా 8.25 - 10.9 శాతం వడ్డీలను చెల్లించాల్సి ఉంటున్నది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణానికి భారీ వడ్డీలను సాలీనా చెల్లించాల్సి ఉంటుందని గమనించాలి.

ఈ రుణాలకు వడ్డీల రూపంలో ప్రతి ఏట రూ: 13,000 కోట్లను రాబోయే 13 ఏండ్ల పాటు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని, మెుత్తంగా రూ: 71,575 కోట్లను వడ్డీలుగా మాత్రమే చెల్లిస్తూ, రుణ విముక్తం కావడానికి మెుత్తంగా రూ: 1,69,023 కోట్లను తెలంగాణ చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని అంటున్నారు.ప్రాజెక్టు నుంచి నీళ్లు తోడకపోయినా ఈ రుణాలు చెల్లించడం తప్పనిసరి కానుందని, ప్రాజెక్టును వినియోగిస్తే వచ్చే విద్యుత్తు ఖర్చులు, మెయింటెనెన్స్‌ భారం కూడా భారీగానే పడుతుందని గమనించాలి.

Advertisement
ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 

తాజా వార్తలు