యూకే : భారత సంతతి యువ వైద్యుడికి డయానా అవార్డ్ 2024!

భారత సంతతికి చెందిన వైద్యుడు, బ్రిటీష్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్( British Indian Medical Association ) (బీఐఎంఏ) కో ఫౌండర్ హర్రూప్ సింగ్ బోలా (23) ఈ ఏడాది గాను ప్రిన్స్ డయానా అవార్డ్‌కు ఎంపికయ్యారు.విద్యార్ధులలో మెంటార్‌షిప్ ఆవశ్యకతను పెంపొందించడం, సానుకూల మార్పును సృష్టించడం వంటి చర్యలు చేపట్టినందుకు గాను హర్రూప్‌కు ఈ అవార్డ్ దక్కింది.

 Harroop Singh Bola Named Among The Winners Of This Year's Diana Award 2024 , Bri-TeluguStop.com

వేల్స్ యువరాణి ప్రిన్స్ డయానా( Princess Diana of Wales ) జ్ఞాపకార్థం నెలకొల్పబడిన ఈ పురస్కారాన్ని ఆమె కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీలు ప్రతిభావంతులకు అందజేస్తున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ బోలా ( Dr.Bola )మాట్లాడుతూ.బ్రిటీష్ ఇండియన్ మెడికల్ కమ్యూనిటీలోని అసమానతలను పరిష్కరించడంలో, తగ్గించడంలో చేసిన మా ప్రయత్నాలకు అవార్డ్‌తో గుర్తింపు దక్కడం విలువైన అవకాశంగా పేర్కొన్నారు.

బోలా 2020లో బీఐఎంఏ స్థాపనలో కీలకపాత్ర పోషించారు.లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో తొలి తరం వైద్య విద్యార్ధిగా ఆయన పలు సవాళ్లను అధిగమించారు.

Telugu Britishindian, Diana Awards, Dr Bola, Dr Harrup Singh, Harroopsingh, Prin

ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అతను నాలుగు కమిటీలకు నాయకత్వం వహిస్తున్నారు.దీనితో పాటు జనరల్ మెడికల్ కౌన్సిల్‌కు సహకరించడం, ఆరోగ్య సంరక్షణలో బ్రిటీష్ ఇండియన్ ప్రాతినిథ్యాన్ని పెంచడం ద్వారా అసాధారణ నాయకత్వాన్ని ప్రదర్శించినందుకు ప్రశంసలు అందుకున్నాడు.డాక్టర్ బోలా సారథ్యంలో బీఐఎంఏ 2000కు పైగా సభ్యత్వాలను , ప్రపంచవ్యాప్తంగా 7 వేలకు పైగా వ్యక్తులకు చేరువైంది.ఈ ఏడాది డయానా అవార్డ్ కోసం ప్రపంచవ్యాప్తంగా 1700కు పైగా నామినేషన్స్ వచ్చాయి.

వీటన్నింటిని దాటుకుని డాక్టర్ హర్రూప్ సింగ్( Dr.Harrup Singh ) బోలా తదితరులకు డయానా అవార్డ్ దక్కడం విశేషం.

Telugu Britishindian, Diana Awards, Dr Bola, Dr Harrup Singh, Harroopsingh, Prin

ఇకపోతే.ఈ ఏడాది మార్చిలోనూ ఇద్దరు భారతీయులకు ‘‘ Diana Legacy Awards ’’ దక్కిన సంగతి తెలిసిందే.ఉదయ్ ఎలక్ట్రిక్ వ్యవస్ధాపకుడు ఉదయ్ భాటియా, హ్యూసోఫ్‌తెమైండ్ ఫౌండేషన్ వ్యవస్ధాపకురాలు మానసి గుప్తాలను ఈ పురస్కారాలు వరించాయి.విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉదయ్ ‘‘ Outage Guard bulb ’’ను ఆవిష్కరించాడు.

ఇక మానసి గుప్తా విషయానికి వస్తే .మానసిక ఆరోగ్యానికి మద్ధతు ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా 11 సెషన్‌లకు పైగా వ్యక్తిగతంగా పంపిణీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube