వీడియో వైరల్: పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్న సుకుమార్, అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎన్నో అంచనాలను పెంచుతూ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

 Video Viral Pushpa 2 Success Celebrations Sukumar, Allu Arjun, Allu Arjun ,sukum-TeluguStop.com

ఈ క్రమంలో మొదటి రోజు కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి.ఇక మొదటి రోజు అక్కడక్కడ సినీ ప్రేక్షకుల మధ్య ఫ్యాన్ వార్ జరిగినట్లుగా సమాచారం.

మరొకవైపు పుష్ప 2 సినిమా హిట్ అయిందని అల్లు అర్జున్( Allu Arjun ), నిర్మాతలు, డైరెక్టర్లు అందరూ కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు.ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ ఇంట్లో పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా సుకుమార్ ( Sukumar )అల్లు అర్జున్ సంతోషంతో కేక్ కట్ చేసి తినిపించుకున్నారు.అలాగే వెనుక భాగంలో భారీగా ఫైర్ క్రాకర్స్ పేల్చడం మనం చూడవచ్చు.మొత్తానికి పుష్ప 2 సక్సెస్ ని చిత్ర యూనిట్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక సినిమా విషయానికి వస్తే మంచి పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక సినిమాలోని పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రాగా.మొత్తానికి పుష్ప 2 విజయంతో బన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రికార్డులను సొంతం చేసుకున్నాడు.ఇక మొదటిరోజు హైదరాబాద్ తొక్కిసలాటలో ఓ మహిళా చనిపోయిన సంగతి తెలిసిందే.

అలాగే ముంబైలో కూడా ఓ థియేటర్ లో ఓ వ్యక్తి ఏదో స్ప్రే చేసి షోను నిలిపేలా చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube