దళిత భంధు నూటికి నూరుశాతం అమలు చేసిన జిల్లాగా సంగారెడ్డి అగ్రస్థానంలో నిలిచిందన్న హరీష్ రావు

రాష్ట్రంలో దళిత భంధు నూటికి నూరుశాతం అమలు చేసిన జిల్లాగా సంగారెడ్డి అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వెల్లడించారు.సంగారెడ్డి జిల్ల పటాన్ చెరు నియోజకవర్గం పట్టణ కేంద్రంలోని మైత్రి గ్రౌండ్స్ లో దళితభంధు పధకాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.

 Harish Rao Tops Sangareddy As 100% Implementation District For Dalitbandhu Schem-TeluguStop.com

ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతి ప్రధాత కేసీఆర్ చిత్రపటానికి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ,మెదక్ శాసనమండలి సభ్యులు యాదవ రెడ్డి శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా కలెక్టరు హన్మంతరావు SP రమణ కుమార్‌ లతో కలిసి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ‌.దళిత భందుపంపిణీ పథకం రాష్ట్రం లోనే ముందు సంగారెడ్డి జిల్లాలో 100% అమలు చేసినందుకు కలెక్టర్ హనుమంతు రావును ఆయన అభినందించారు .

దళిత బంధుపథకం ఒక సామాజిక ఉద్యమమన్నారు. పటాన్ చెరు లో 100 యూనిట్లు ఒకే సారి దళిత భందు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఏమి చేయలేదని భారతీయ జనతాపార్టీ భారతీయ పెద్ద జూట పార్టీయని ఎద్దేవా చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో గుజరాత్ లో వారానికి ఒక రోజు పవర్ హాలిడే ఉందని తెలంగాణ లో 24 గంటల కరెంట్ సరఫరా చేయటం జరుగుతుందని వివరించారు.1200 కోట్లు ఖర్చు పెట్టి కరెంట్ కొంటున్నామని, ప్రజల కు ఇబ్బందులు లేకుండా చేసామని తెలిపారు.దళిత బందు పథకం లబ్దిదారులకు నేడు నిజమయిన ఉగాది ఒక రోజు ముందు గానే వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో స్ధానిక టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.తన్నిరు హరిశ్ రావు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి , భూపాల్ రెడ్డి రాష్ట్ర శాసనసభ మండలి మాజీ ప్రొటెం చైర్మన్, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ఎమ్మెల్యే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube