సమంత ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి.
సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడం ఒక కారణం అయితే.పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్ చేయడం మరొక కారణం.
ఈమె విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ విడాకుల తర్వాత మాత్రం వరుస సినిమాలు అంగీకరిస్తూ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.
టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు సిద్ధం అయ్యింది.ఇలా ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఈమె ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.

ఆమె విషయంలో ఏం జరిగిన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది.తాజాగా సమంత ఒక పోస్ట్ పెట్టింది.నయనతార ఈమెకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందని చెబుతూ ఆమెకు థాంక్స్ చెప్పింది.సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా కాతు వాకుల్ రెండు కాదల్.
ఈ సినిమా ఇట్టవలె షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో నటించిన ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ మంచి స్నేహితులు ఆయాయ్రు వీరి స్నేహానికి గుర్తుగా నయనతార సమంత కు ఒక గిఫ్ట్ పంపింది.ఖరీదైన ఇయర్ రింగ్స్ పంపింది నయన్.ఈమె పంపిన ఈ గిఫ్ట్ ను ఫోటో తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది సామ్.
డియర్ ఖతీజా.విత్ లవ్.కణ్మణి.అంటూ నయన్ రాసి గిఫ్ట్ పంపితే దానికి థాంక్స్ చెబుతూ సామ్ ఫోటో షేర్ చేసింది.
ఈ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.







