ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.
ఏపిలో 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికలు చాలా సీరియస్ గా కనిపిస్తున్నాయి.కానీ ఎన్నికల ప్రచారం మరియు పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన విషయంలో అధికార పార్టీ వైసీపీ( YCP ) చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది.
ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్( CM Jagan ) ఏడాది నుండి ఎన్నికలపై తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తూ రకరకాల సర్వేలు చేయించుకుని వాటి ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.మరోపక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రెండోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా రాజకీయం చేస్తున్నారు.
జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపినట్లు పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా పవన్ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా కూటమి అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్రమంలో ఇటీవల తాడేపల్లిగూడెంలో “జెండా” పేరిట టీడీపీ…జనసేన సంయుక్తంగా భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.ఈ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.
తన ఓటమికి పార్టీ కార్యకర్తలు నాయకులు కారణమని మండిపడ్డారు.ఇదే సమయంలో తనకి ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వడం జరిగింది.
ఈ సభ అనంతరం కాపు సంక్షేమ సేన నాయకుడు హరి రామ జోగయ్య లేఖ రాశారు.
తెలుగుదేశం జనసేన( Janasena ) బాగు కోరి నేను ఇచ్చే సలహా.అధినేతలు ఇద్దరికీ నచ్చినట్లు లేదు.అది వారి కర్మ, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు అనంతరం హరి రామ జోగయ్య( Hari Rama Jogaiah ) కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో జాయిన్ అయ్యారు.దీంతో గందరగోళం వాతావరణం నెలకొన్న సమయంలో తాజాగా జనసేన పార్టీపై హరి రామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను చచ్చేంత వరకు జనసేనతోనే ఉంటానని స్పష్టం చేశారు.పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టే వరకు తన పోరాటం ఆగదని వ్యాఖ్యానించారు.అనుభవం లేని వారి సలహాల వల్ల గతంలో పవన్ ఓడిపోయారు.తన చర్యలను కొందరు ప్రశ్నిస్తున్నారు ఎవరు ఏమనుకున్నా.
తన పని తాను చేసుకుంటూ వెళ్తానని హరి రామ జోగయ్య పేర్కొన్నారు.