రజనీకాంత్ హీరోగా చేసిన ‘చంద్రముఖి’( Chandramukhi ) సినిమా తెలుగు, తమిళ రాష్ట్రాలలో సూపర్ డూపర్ హిట్ అయింది.ఈ సినిమా ప్రభు, రామ్ కుమార్ గణేషన్ నిర్మాణంలో వచ్చి వారికి కాసుల వర్షం కురిపించింది.
ఈ మూవీ సక్సెస్‌లో రజనీకాంత్ చాలా పాత్ర పోషించారు.ఇందులో “లకలకలక” అనే పదం వాడాలని రజనీకాంత్ సూచించారు.
చిన్నతనంలో ఓ మరాఠి నాటకంలో విలన్ ‘లకలకలక.’ అంటూ భయం పుట్టించడం రజనీకాంత్ ఒకసారి విన్నాడు.
దానినే దీంట్లో వాడదాం అన్నప్పుడు సినిమా మేకర్స్ ఓకే చెప్పేసారు.ఈ సినిమా టైటిల్ మొదటగా నాగవల్లి అని పెడదాం అనుకున్నారు కానీ రజనీకాంత్ ఆ టైటిల్ బాగోలేదు వేరే టైటిల్ ఆలోచించాలని సూచించారు.
చివరికి చంద్రముఖి అనే టైటిల్ ఫైనలైజ్ చేశారు.

ఈ మూవీలో చంద్రముఖి పాత్రను స్నేహ, రీమాసేన్( Sneha, Reemasen ) వంటి హీరోయిన్లకు ఇద్దామనుకున్నాడు కానీ వారి సెట్ కాలేదు.చివరికి సిమ్రాన్ ను తీసుకున్నారు.రెండు రోజుల షూటింగ్ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని తేలడంతో చివరికి జ్యోతికకి( Jyothika ) ఆ పాత్ర దక్కింది.
ఈ మూవీ 90% షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలోనే జరిగింది.మిగతా షూటింగ్ తమిళనాడులో, రెండు పాటలు టర్కీలో జరిగాయి.రూ.19 కోట్లు బడ్జెట్ తో ఈ మూవీ 2005 ఏప్రిల్ 14న విడుదలై సూపర్ హిట్ అయ్యింది.ఒక భారతదేశంలోనే ఈ మూవీ రూ.45 కోట్లు వసూలు చేసింది.వరల్డ్‌వైడ్‌గా రూ.75 కోట్లు కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది.‘చంద్రముఖి’ తమిళనాడులోని చాలా థియేటర్లలో 175 రోజులు ఆడింది.చెన్నై శాంతి థియేటర్‌లో 890 రోజుల పాటు ఆడి రికార్డు క్రియేట్ చేసింది.ఈ సినిమాలో చేసినందుకు రజనీకాంత్‌కు రూ.15 కోట్లు అందించారు మేకర్స్.ఆ కాలంలో ఆ పారితోషికం చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు .

నిజానికి చంద్రముఖి సినిమా మలయాళ మూవీ ‘మణిచిత్రతాళు (1993)’ ఆధారంగా తెరకెక్కింది.చంద్రముఖి రాకముందే ఈ మూవీ ని దర్శకుడు వి.ఎన్.ఆదిత్య చూసి బాగా మెచ్చకున్నాడు.ఈ సినిమా తెలుగులో చేస్తే సూపర్ హిట్ అందుకోవచ్చు అని మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) కూడా చెప్పాడు.కానీ చిరంజీవి ఆ మూవీ చేసేందుకు ఆసక్తి చూపలేదు.చివరికి రజనీకాంత్, డైరెక్టర్ పి వాసు కలిసి ఈ మూవీ ఆధారంగా చంద్రముఖి మూవీ తీసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు.
అప్పుడు మెగాస్టార్ బాగా బాధపడిపోయాడు.అంతే కాదు దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఆ కథతో సినిమా తీస్తే మంచి హిట్ అందుకోవచ్చు అని చెప్పారు కాబట్టి అతడి జడ్జిమెంట్ ను పొగిడాడు.







