గుజరాత్ లో తీవ్ర సంచలనం సృష్టించిన పటేళ్ల పోరాట సమితి నేత హార్దిక్ పటేల్ లోక్ సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.అయితే గత ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన చేసినా అప్పటికి ఆయన వయస్సు సరిపోకపోవడంతో… పోటీ చేయలేదు.
ఇప్పుడు పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కధనాలు వినిపిస్తున్నాయి.

గుజరాత్‌లోని అమ్రేలి ప్రాంతం నుంచి హార్దిక్ బరిలోకి దిగే అవకాశం ఉంది.ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టకుండా హార్దిక్‌కు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.ఇటీవలి కాలంలో బిజెపికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ పోరాటం చేస్తున్నారు.