ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి కావడం తెలిసిందే.ఈ క్రమంలో ఆయన వైసీపీ హైకమాండ్ పై అలిగినట్లు.
వార్తలు రాగా అనంతరం సీఎం జగన్ తో బాలినేని భేటీ అయి.అలక పై వచ్చిన వార్తలలో వాస్తవం లేదని మీడియాతో తెలిపారు.ఇదిలా ఉంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం సోమవారం ఒంగోలు జిల్లాకు వచ్చిన బాలినేనికి అభిమానులు అడుగడుగున భారీ ర్యాలీ లతో స్వాగతం పలకడం జరిగింది.అనంతరం నివాసంలో బాలినేని మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా ఉన్నప్పటికంటే మంత్రి పదవి రాజీనామా చేశాక… పార్టీ క్యాడర్ లో నాపై ఎక్కువ చూపారని తెలిపారు.
పెద్దఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తాను అని పేర్కొన్నారు.
ఈనెల 22వ తారీఖున సీఎం జగన్ “వైయస్సార్ సున్నా వడ్డీ” పథకాన్ని ప్రారంభించడానికి ఒంగోలు వస్తున్నందుకు జిల్లా మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు.ఈ క్రమంలో పార్టీ తరఫున ఎటువంటి బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తూ అని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.







