హ్యాపీడేస్ టైసన్ ఇప్పుడు ఏకంగా మైక్ టైసన్ లా మారిపోయాడు

హ్యాపీడేస్ సినిమాలో బక్కపలచగా ఉంటూ ఫన్ అండ్ ఎమోషనల్ మిక్స్ చేసిన టైసన్ అనే క్యారెక్టర్ చేసిన రాహుల్ అందరికి గుర్తుండే ఉంటారు.

సీనియర్ ని లవ్ చేసే జూనియర్ గా తన పాత్రకి పూర్తి న్యాయం చేసి ఆకట్టుకున్నాడు.

ఇక ఆ సినిమాలో నటించిన అందరూ కూడా తరువాత టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని స్థిరపడ్డారు.అందరికంటే ఎక్కువ ఫేం వచ్చింది అంటే అది తమన్నా తరువాత నిఖిల్ సిద్దార్ద్ కే అని చెప్పాలి.

తమన్నా స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయితే నిఖిల్ ఒక ప్రత్యేకమైన జోనర్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.యువ హీరోలలో తనకంటూ ఒక బ్రాండ్ ని ఏర్పరుచుకున్నాడు.

వరుణ్ సందేశ్ హీరోగా సక్సెస్ అయినా తరువాత వరుస ఫ్లాప్ లతో గాడితప్పాడు.మళ్ళీ ఇందువదన అనే సినిమాతో లైన్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement

ఇక టైసన్ పాత్రలో చేసిన రాహుల్ మాత్రం హ్యాపీడేస్ తర్వాత ఓ రొమాంటిక్ లవ్ స్టొరీ సోనాల్ చాహన్ తో కలిసి చేశాడు.అది వర్క్ అవుట్ అవ్వలేదు.

తరువాత చాలా గ్యాప్ ఇచ్చి వెంకటాపురం అనే థ్రిల్లర్ మూవీతో వచ్చాడు.ఇది కొంత వరకు ఒకే అనిపించుకున్న అతనికి ఆశించిన ఫేమ్ అయితే తీసుకురాలేదు.

అయితే ప్రస్తుతం వంద కోట్లు అనే క్రైమ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా కోసం పూర్తిగా కండలు పెంచిన దేహంతో నిజంగా మైక్ టైసన్ మారిది కనిపిస్తున్నాడు.

తాజాగా అతని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.వీటిని చూసిన నెటిజన్లు హ్యాపీ డేస్ టైసన్ కాస్తా మైక్ టైసన్ లా తయారయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు