హను మాన్ లో మీనాక్షి ఎవరు..?

అ! తో డైరక్టర్ గా అందరిని ఆశ్చర్యపరచిన ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ సినిమా కల్కితో జస్ట్ ఓకే అనిపించాడు.

ఇక థర్డ్ ప్రాజెక్ట్ గా వచ్చిన జాంబి రెడ్డి సినిమాతో మరోసారి తన సత్తా చాటాడు.

ఇక లేటెస్ట్ గా తేజా సజ్జాతో హను మాన్ తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.డిసెంబర్ 13న మీనాక్షి పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చిత్రయూనిట్.

హను మాన్ సినిమాను ప్రశాంత్ వర్మ క్రేజీగా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ఉంటాయని అంటున్నారు.

హను మాన్ సినిమా తప్పకుండా మరోసారి ప్రశాంత్ వర్మ ప్రతిభ చూపించేలా ఉంటుందని అంటున్నారు.తేజా సజ్జాకి కూడా ఈ సినిమా కెరియర్ కు మరో బూస్టింగ్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు.

Advertisement

మొత్తానికి హను మాన్ తో ప్రయోగం చేస్తున్న ప్రశాంత్ వర్మ ఏమేరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి.తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని ఇండియన్ సూపర్ హీరో సినిమాగా హను మ్యాన్ అదిరిపోతుందని అంటున్నారు.

మరి ప్రశాంత్ వర్మ ఏం చేస్తాడో అని ఆడియెన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు