" బాలకృష్ణ ఫాన్స్ అర్ధం చేసుకోవాలి "

జై బాలయ్య అనే టైటిల్ ని ఫిక్స్ అయ్యాక కూడా తమ హీరో పేరు తో టైటిల్ పెట్టకుండా కృష్ణ గాడి వీర ప్రేమ గాథ అంటూ టైటిల్ పెట్టాల్సిన పనేంటి అని బాలయ్య ఫాన్స్ ఇప్పటికే నానీ మీదా డైరెక్టర్ హను రాఘవాపూడి మీదా సీరియస్ గా ఉన్నారు.

తొలి సినిమా అందాల రాక్షసి తో క్లాసిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హనూ ఇప్పుడు రెండవ సినిమా కే నానీ లాంటి అప్ కమింగ్ సూపర్ స్టార్ తో సినిమా తీసే అవకాశం కొట్టేసాడు.

అయితే ఈ జై బాలయ్య విషయం గురించి ఒక ఇంటర్వ్యూ లో సమాధానం చెబుతున్నాడు హనూ.‘ఇందులో హీరో నాని బాలకృష్ణ అభిమాని కావడంతో తనకు ఎదురైన ఇబ్బందులను చాలా ఈజీగా తప్పించుకొంటాడు.అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం పరిధిలో ఈ చిత్రం అవ్ స్టోరీ జరుగుతుంది.

అక్కడ బాలయ్యకు ఫ్యాన్స్ ఎక్కువ.కథలో భాగంగానే హీరో బాలయ్య అభిమానిగా చూపించాం.

ఈ చిత్రం షూటింగ్ చేసే సమయంలో హీరో నాని చేతికి ‘జై బాలయ్య’ అనే టాటూ వుండటాన్ని ఎవరో సెల్ ద్వారా క్లిక్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు.దాంతో ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ అనే టైటిల్ పెట్టారని ప్రచారం జరిగింది.

Advertisement

అలా ‘జై బాలయ్య’ అనే టైటిల్ బయటకొచ్చింది.నిజానికి మేము ఆ టైటిల్ అనుకోలేదు, ఈ విషయం బాలకృష్ణ అభిమానులు కాస్త అర్ధం చేసుకోవాలి ’ అన్నారు ఆయన.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు