బీఆర్ఎస్ వలనే సంక్షోభంలో చేనేత రంగం..:మంత్రి పొన్నం

తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar ) కీలక వ్యాఖ్యలు చేశారు.

బలవన్మరణాలకు పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

ముందుగా మరణించిన చేనేత కార్మికులకు మంత్రి పొన్నం సంతాపం తెలిపారు.కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటానికి బీఆర్ఎస్, బీజే( BRS, BJP )పీనే కారణమని ఆరోపించారు.

బాధిత కుటుంబాలకు అన్ని రకాల సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తీరు వలనే చేనేత రంగం సంక్షోభంలో పడిందన్నారు.అయితే తమ ప్రభుత్వం చేనేతలకు అండగా ఉంటుందని, చేనేత కార్మికుల పాత బకాయిలను కూడా చెల్లిస్తామని మంత్రి పొన్నం తెలిపారు.

Advertisement

సిరిసిల్ల చేనేత కార్మికులకు పని లేదనే పరిస్థితి రానివ్వమని స్పష్టం చేశారు.చేనేత కార్మికులు అధైర్య పడొద్దని తెలిపారు.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు