బెడ్ రూమ్ లో ఇవి వద్దని సైన్స్ చెబుతోంది

బెడ్ రూమ్ ని రెండు పనులకి మాత్రమే వాడాలి.ఒకటి నిద్రపోవడం, మరొకటి శృంగారం.

ఈ పనుల కోసం మాత్రమే పడకగది ఉన్నది.కాని ఈ బెడ్ రూమ్లని స్మార్ట్ ఫోన్లు ఆక్రమించేసాయి ఇప్పుడు.

కొందరైతే బెడ్ రూమ్ లోనే టీవి పెట్టేస్తారు.ఇలాంటి వస్తువులు బెడ్ రూమ్ లో పెట్టుకోవడంతోపాటు మరికొన్ని పొరపాట్లు బెడ్ రూమ్ లో చేయొద్దని సైన్స్‌ చెబుతోంది.

* స్మార్ట్ ఫోన్ నిద్ర పోయే అలవాటుని పూర్తిగా మార్చేస్తోంది.ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, ఎన్నిగంటల నిద్రపడుతుందో కూడా తెలియదు.

Advertisement

ఇలా స్మార్ట్ ఫోన్ వలన నిద్రలేమి సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే, రాత్రుల్లో మొబైల్ వాడటం వలన మెలాటోనిన్ అనే నిద్ర హార్మోనుపై నెగెటివ్ ప్రభావం పడుతుందట.* రాత్రుల్లో పురుగులు రావడం, చీమలు కుట్టడం .

ఇలాంటివన్ని బెడ్ రూమ్ లోకి ఆహారపదార్థాలు తీసుకుపోవడం వలన జరుగుతుంది.మరీ ముఖ్యంగా స్వీట్స్ ని బెడ్ రూమ్ లోకి అస్సలు తీసుకెళ్ళకూడదు.

* బెడ్ రూమ్ లో టెలివిజన్‌ పెట్టుకుంటారు కొందరు.టీవి లైట్ కూడా మెలాటోనిన్ సీక్రేషన్ ని అడ్డుకుంటుంది.

అందుకే నిద్రపట్టడం కష్టమైపోతుంది.* బెడ్ రూమ్ లో భాగస్వామితో గొడవపెట్టుకోవడం కూడా నిద్రపై చెడుప్రభావం చూపుతుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఎందుకంటే రొమాన్స్ కి బదులు గొడవలు పెట్టుకుంటే నిద్రనిచ్చే ఎండార్ఫిన్స్ విడుదల కావు.* చివరగా, ఆఫీసు పనుల్ని పడకగదిలోకి తీసుకెళ్తే స్ట్రెస్, ఒత్తిడి పెరుగుతుంది.

Advertisement

ఈ కారణంతో కూడా స్లీప్ హార్మోన్‌లు సీక్రేట్ అవకుండా ఆగిపోతాయి.

తాజా వార్తలు