హెచ్-1 బీ వీసాదారులు ఇంతమందా..అందుకే ట్రంప్ ఈ ప్లాన్ వేశాడు..!!!

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ ఎలా విబృంభిస్తొందో మనకు తెలిసిందే.అగ్రరాజ్యనిదే అగ్రస్ధానం అన్నట్లుగా కరోనా పాజిటివ్ కేసుల్లోను, కరోనా మరణాలోను.

అమెరికానే ముందుంది.దీంతో కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ట్రంప్ స‌ర్కార్ అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు.కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టే ప్రయత్నంలో భాగంగా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇత‌ర దేశాల నుంచి త‌మ దేశానికి వ‌చ్చే వ‌ల‌స‌లదారుల‌‌పై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే.అమెరికాకు వచ్చే వ‌ల‌స‌లదారుల‌‌పై ట్రంప్ ఏప్రిల్ నుంచి 3 నెలల తాత్కాలిక నిషేధం విధించారు.

వైరస్ వ్యాప్తి మరింత తీవ్రతరం కావడంతో తాజాగా ఆ నిషేధాన్ని డిసెంబరు వరకు పొడిగిస్తూ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.అమెరికాలో నిరుద్యోగ స‌మ‌స్య‌ను అరికట్టేందుకే ట్రంప్ హెచ్‌1-బీ, హెచ్-4 స‌హా అన్ని ర‌కాల టెంప‌ర‌రీ వ‌ర్క్ వీసాల‌పై నిషేధం కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.

ట్రంప్ నిర్ణ‌యంతో హెచ్‌1-బీ వీసాలు, ఎల్ వీసాలు, హెచ్‌2-బీ సీజనల్ వర్కర్ వీసాలు, జే వీసాలతో అమెరికాలోకి వచ్చేందుకు అవసరమైన అన్నిరకాల వీసాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.ఈ నేపథ్యంలో యునైటెడ్‍ స్టేట్స్ సిటిజన్‍షిప్‍ అండ్‍ ఇమిగ్రేషన్‍ సర్వీసెస్‍ (యూఎస్‍సీఐఎస్‍) మొట్టమొదటిసారిగా హెచ్‍ 1బీ వీసాలపై పనిచేస్తున్న వారి వివరాలను వెల్లడించింది.యూఎస్‍సీఐఎస్‍ వివరాల ప్రకారం.2019 సెప్టెంబరు నాటికి హెచ్‍ 1బీ వీసా కింద 5,83,420 మంది పని అనుమతి పొందారు.అయితే 2019 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అందులో 96,798 మంది హెచ్‍ 1బీ వీసాదారులను శాశ్వత నివాస హోదా సర్దుబాటు చేసినట్టు అంచనా వేస్తోంది.అధే విధంగా చూస్తే.2020 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో (అక్టోబరు- మార్చి) పనిచేయడానికి అనుమతిచ్చిన వారి సంఖ్య దీనికి పది శాతం ఎక్కువ ఉండవచ్చని తెలిపారు.

Advertisement

ఇక హెచ్‌-1బీ వీసాదారుల్లో కొంతమంది ఉద్యోగాలు ఇప్పటికిప్పుడు భద్రంగానే ఉన్నా.భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.కరోనాతో అమెరికాలో నిరుద్యోగం భారీగా పెరిగింది.

కరోనా సంక్షోభం కారణంగా గత రెండు నెలల్లో అమెరికాలో ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.దీంతో అమెరికన్లే ఉద్యోగాలు దక్కాలనే ఆలోచనలతో.

ట్రంప్ ఏకంగా హెచ్‍ 1బీ తదితర వీసాలను డిసెంబరు వరకు రద్దు చేశారు.ఇటీవల కాలంలో అమెరికా జారీ చేసిన హెచ్‍ 1బీ వీసాల్లో భారతీయులే 70 శాతం వరకు పొందారు.

కీలకమైన పారిశ్రామిక రంగాల్లో 2 కోట్ల మంది అమెరికా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయినట్టు అధ్యక్షుడి ప్రకటన ద్వారా తెలుస్తోంది.

తప్పించుకుంటూ అధికారులనే కారుతో ఢీకొట్టి .. భారత సంతతి వ్యక్తిని కాల్చిచంపిన పోలీసులు

Advertisement

తాజా వార్తలు