ఈ ప్రభుత్వ మనుగడ దానిపైనే ఆధారపడి ఉంది! కుమార స్వామి

కాళ్ల పారాణి ఆరకముందే వైధవ్యం గురించి మాట్లాడినట్టు ఉంది జె డిఎస్ నేత కుమారస్వామి వ్యవహారం.

కర్ణాటక( Karnataka )లో కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు కొనసాగితుందని తనకు నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారాయన .

కర్ణాటక లో అసెంబ్లీ ఎన్నికలకు మరో అయిదు సంవత్సరాల సమయం ఉందని అనిపించడం లేదని ఆయన పార్టీ విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు.తనను తప్పుగా అర్దం చేసుకోవద్దని తాను ఏ రకమైన కుట్రలు చేయడం లేదని అలాగే జోష్యం కూడా చెప్పడం లేదని రాష్ట్ర పరిస్థితి చూసి ఒక విశ్లేషకుడిలా చెప్తున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వం లో వచ్చే ప్రభుత్వాన్ని బట్టి కర్ణాటక ప్రభుత్వ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తాను భావిస్తున్నానని ఆయన అంటున్నారు .

రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు ,మనం స్పష్టంగా చెప్పలేం ఇంతకుముందు కూడా అనూహ్య పరిణామాలు జరగటం మనం చూసాం, అందువల్ల ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మనుగడ సాధిస్తుందని నమ్మకం ప్రస్తుతానికి తనకు లేదని ఆయన వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ ప్రభుత్వం( congress govt ) ఘనంగా ప్రచారం చేసుకున్న ఐదు పథకాల వల్లే గెలుపొందిందని ఆయన చెప్పుకొచ్చారు ప్రతి ఇంటికి నెలకు 3000 రూపాయలు ఆ ఇంటి యజమానురాలు అయిన స్త్రీ ఖాతాలో జమ చేస్తామని , ప్రతి నిరుద్యోగికి నెలకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద అందిస్తామని ,ప్రతి మహిళకు కర్ణాటకలోని ప్రభుత్వ బస్సులలో ఫ్రీ బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని, ప్రతి ఇంటి<కి 10 కిలోల బియ్యాన్ని నెలకు ఉచితంగా అందజేస్తామని, 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్ మాఫీ చేస్తామని ఇలా ఐదు ప్రధాన హామీలతోనే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

Advertisement

ఇప్పుడు కుమారస్వామి కూడా ఆ హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు చిత్తశుద్ధితో ఉంటుందో అన్నది మేము గమనిస్తామని, ఈ హామీల అమలులో విఫలమైనా లేకపోతే ఈ హామీలు అమలుకు ఏ విధమైన షరతులు పెట్టినా కూడా మేము చూస్తూ ఊరుకోమని.అదే తమకు వచ్చే ఎన్నికలలో ప్రధాన ఎన్నికల అస్త్రం అవుతుందని హెచ్చరించారు.ఈ ఐదు హామీల వల్లే ప్రజలు మెచ్చి కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారని అదే తమ పార్టీ ఉనికికి ప్రమాదకరంగా మారిందని అందువల్ల ఈ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించాలని ఆయన చెప్పుకొచ్చారు ఏది ఏమైనా గెలిచి ఇంకా ఒక నెల కూడా కాకముందే ప్రభుత్వంపై శాపనార్ధాలు పెడుతున్న కుమారస్వామి వైఖరిపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు