సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ గుంటూరు కారం.ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గత ఏడాది కాలం గా ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త వచ్చి సినిమా పై అంచనాలు పెంచేస్తూనే ఉన్నాయి.ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం సమయంలోనే హీరోయిన్ పూజా హెగ్డే అంటూ ప్రకటించారు.
కానీ మధ్య లో ఆమెను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న శ్రీ లీలను( Sreeleela ) మొదటి హీరోయిన్ గా మార్చేశారు.
సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేయడం జరిగింది.అలా గుంటూరు కారం సినిమా హీరోయిన్ ఇష్యూ పెద్దగా మారింది.
హీరోయిన్ పూజా హెగ్డే కి ఈ మధ్య కాలం లో క్రేజ్ లేదు.అయినా కూడా త్రివిక్రమ్ తన గత సినిమా హీరోయిన్ అవ్వడం వల్ల పూజా హెగ్డే ని గుంటూరు కారం కోసం తీసుకున్నాడు.

కానీ మహేష్ బాబు( Mahesh Babu ) కి మాత్రం ఆమె తో నటించడం అస్సలు ఆసక్తి లేదు.అందుకే కొన్ని రోజుల షూటింగ్ తర్వాత త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు నిర్ణయం తో ఏకీభవించి మరో హీరోయిన్ ను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.అయితే నిర్మాత నాగ వంశీ మాత్రం పూజా హెగ్డే కి డేట్లు వీలు పడక పోవడం వల్లే గుంటూరు కారం నుండి తప్పుకుంది అన్నట్లుగా చెబుతున్నాడు.

గతం లోనే ఒక మీడియా చిట్ చాట్ లో నాగ వంశీ మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా మేకింగ్ ఆలస్యం అయింది.ఆ కారణంగా పూజా హెగ్డే డేట్లు క్లాష్ అయ్యాయి.అందుకే ఆమెను తొలగించి శ్రీ లీల ను తీసుకున్నట్లుగా పేర్కొన్నాడు.శ్రీ లీల ప్రస్తుతం పది సినిమాలు చేస్తోంది.పూజా హెగ్డే ఎన్ని సినిమా లు చేస్తుందో అందరికి తెల్సిందే.ఇప్పటికే పూజా హెగ్డే విషయం లో అబద్దం చెప్పిన నాగ వంశీ ఇప్పుడు మళ్లీ అదే అబద్దం ను కంటిన్యూ చేస్తున్నాడు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.