సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”( Guntur Karam )..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంతటా హోప్స్ పెరిగి పోయాయి.మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 40 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.

ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానున్నట్టు ఇప్పటికే మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా పూజా హెగ్డేను( Pooja Hegde ) తీసుకున్నారు.కానీ అనూహ్యంగా ఈమె సినిమా నుండి తప్పుకుంది.మరి ఈమె తప్పుకుందో లేదంటే మేకర్స్ తప్పించారో అర్ధం కాలేదు.అయితే ఈమె తప్పుకోవడంతో సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీల( Sreeleela ) ఫస్ట్ హీరోయిన్ అయిపోయింది.
కానీ పూజా తప్పుకోవడానికి కారణాలు చాలానే వినిపించాయి.

సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ రాగా తాజాగా నిర్మాత ఈమె ఎందుకు తప్పుకుందో వివరించాడు.నిర్మాత సూర్య దేవర నాగవంశీ( Suryadevara Nagavamsi ) మాట్లాడుతూ.ముందుగా గుంటూరు కారం సినిమాను ఆగస్టులో అనుకున్నాం.
కానీ ఇప్పుడు 2024 సంక్రాంతికి పోస్ట్ పోన్ అవ్వడంతో నిదానంగా షూట్ పూర్తి చేస్తున్నాం.అయితే పూజాకు ఇదే సమయంలో హిందీలో ఒక సినిమా చేయాల్సి వచ్చింది.
అందువల్లే డేట్స్ అడ్జెస్ట్ కాలేదు.దీంతో ఆమెను గుంటూరు కారం నుండి తప్పించాం అని ఈయన క్లారిటీ ఇచ్చాడు.







