మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ ల్యాండ్ కేసులో క్వాష్, బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
ఈ మేరకు ఈనెల 16వ తేదీకి విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.ఈ క్రమంలోనే నారాయణ ముందస్తు బెయిల్ ను హైకోర్టు మరో రెండు వారాల పాటు పొడిగించింది.
సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో నారాయణకు ఉన్న ముందస్తు బెయిల్ ను పొడిగించాలని ఆయన తరపు న్యాయవాదులు కోరగా.తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సైతం కోరారు.
దీంతో కేసు విచారణను న్యాయస్థానం రెండు వారాల పాటు వాయిదా వేసింది.







