గుంటూరులో టెన్షన్‌ టెన్షన్‌

ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.ప్రభుత్వం ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా కూడా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భయంకర స్థితిలో పెరుగుతున్నాయి.

ఈ సమయంలోనే గుంటూరులో 44 అనుమానిత కేసులు ఉన్నాయి అంటూ మంత్రి మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు.దాంతో గుంటూరు మొత్తంలో కూడా టెన్షన్‌ వాతావరణం కనిపిస్తుంది.

ప్రతి ఒక్కరు కూడా టెన్షన్‌తో పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు.ఆ 44 మంది ఏ ప్రాంతంకు చెందిన వారో తెలియజేయాలంటూ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల కోసం 88 హాస్పిటల్స్‌ను రెడీ చేసినట్లుగా మంత్రి ప్రకటించాడు.గుంటూరులో అనుమానితుల కేసులు పెరగడంతో వారిని అబ్జర్వేషన్‌లో ఉంచడంతో పాటు వారికి చెందిన వారిని కూడా పరిశీలిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

Advertisement

ఏపీలో కరోనా విజృంభిస్తుందనే వదంతులు సోషల్‌ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

దారుణం: ఐసీ క్రీం ఇప్పిస్తామంటూ లైంగిక దాడి!
Advertisement

తాజా వార్తలు