ఫైనల్ స్టేజ్ లో గుంటూరు కారం.. అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu )లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం.

( Guntur Kaaram ) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంతటా హోప్స్ పెరిగి పోయాయి.

మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి( Meenakshii Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 40 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.

ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానున్నట్టు ఇప్పటికే మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి టీజర్ తో పాటు ఇటీవలే మహేష్ బర్త్ డే కానుకగా మాస్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Advertisement

అంతకు మించి మరో అప్డేట్ లేకపోవడంతో ఎప్పుడెప్పుడు మేకర్స్ అప్డేట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు.అయితే ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఎదురు చూస్తున్నారు.

లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ఫస్ట్ సింగిల్ ఫైనల్ స్టేజ్ లో ఉందట.

మిక్సింగ్ పూర్తి అయితే లిరికల్ సాంగ్ ను రెడీ చేసి మంచి టైం లో ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.చూస్తుంటే అతి త్వరలోనే మేకర్స్ దీనిపై అధికారిక అప్డేట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారో.

ఇక మహేష్ బాబు( Mahesh Babu ) త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన రెండు సినిమాలు డిఫరెంట్ గా ఆడియెన్స్ ను అలరించగా ఇప్పుడు గుంటూరు కారం ఎలాంటి అంచనాలు అందుకుంటుందో అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఈసారి ఈ కాంబో బ్లాక్ బస్టర్ కొట్టాలని వారు ఆశిస్తున్నారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

చూడాలి ఏం జరుగుతుందో.

Advertisement

తాజా వార్తలు