న్యాయం అడిగిన డిస్ట్రిబ్యూటర్స్ పై పవన్ కళ్యాణ్ గుండాయిజం

ఈమధ్య పవన్ కళ్యాణ్ టైమ్ బాగాలేదనే చెప్పాలి.

సర్దార్ గబ్బర్ సింగ్ రికార్డు నష్టాలతో డిజాస్టర్ గా నిలిస్తే, కాటమరాయుడు యావరేజ్ నుంచి హిట్ టాక్ తెచ్చుకోని నష్టాల వైపు నడుస్తోంది.

ఇదిలా ఉంటే సర్దార్ గబ్బర్ సింగ్ నష్టాల వివాదం ఏడాదికాలంగా కొనసాగుతూనే ఉంది.ఆమధ్య సర్దార్ నైజాం పంపిణీదారులు పవన్ నమ్మించి మోసం చేసారని ప్రెస్ మీట్ పెడితే, కృష్ణ డిస్ట్రిబ్యూటర్ ప్రెస్ మీట్ తో పాటు నిరాహారదీక్షకి కూడా దిగిన సంగతి తెలిసిందే.

ఇన్ని నిరసనలు జరుగుతున్నా, ఈ విషయాలు పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళట్లేదా అని మీరు అనుకోవచ్చు.కాని ఇలాంటి విషయాలు మనదాకా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ దాకా ఎందుకు వెళ్ళవు? పవన్ కి విషయం తెలిసింది.కాని పవన్ రియాక్షన్ మాత్రం మనం ఊహించనిదే.

పంపిణీదారులు నిరసన వ్యక్తం చేస్తున్న దీక్ష శిబిరాన్ని పవన్ కళ్యాణ్ మనుషులు కూల్చివేసారట.నిజానిజాలు మాకు తెలియవు కాని, న్యాయం కోరితే పవన్ కళ్యాణ్ మాపై దాడి చేయించారని, పవన్ టీమ్ మా శిబిరాన్ని కూల్చేసారని పంపిణీదారులు వాపోతున్నారు.

Advertisement

ఇదిగోండి .ఇలా ప్ల కార్డులు పట్టుకోని మళ్ళీ రోడ్డు మీద కూర్చున్నారు.పవన్ దిగివచ్చి న్యాయం చేసేదాక, తిరిగిస్తామన్నా డబ్బు ఇచ్చేదాకా ఇక్కడినుంచి కదిలేది లేదు అని అంటున్నారు.

ఈరకంగా పవన్ కళ్యాణ్ పేరు మళ్ళీ వార్తల్లోకి ఎవరు మెచ్చని కారణంతో ఎక్కింది.ఇప్పుడు ఈ విషయం రామ్ గోపాల్ వర్మ దాకా వెళితే అంతే సంగతులు .మళ్ళీ వర్మ బ్యాటింగ్ మొదలవుతుంది.పవన్ ఫ్యాన్స్ కి బీపి రేజ్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు