దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సాయి పల్లవి( Sai Pallavi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అద్భుతమైన కథలను ఎంపిక చేసుకొని కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సాయి పల్లవి అంటే ఎంతోమంది ప్రేక్షకులకు అభిమాని నటిగా మారిపోవడమే కాకుండా సెలబ్రిటీలకు కూడా ఈమె క్రష్ అయ్యారు .
ఎంతోమంది హీరోలు కూడా సాయి పల్లవి నటనకు ఫిదా అయ్యారు.ఈ క్రమంలోనే సాయి పల్లవి నటన అంటే మాకు ఇష్టం అని ఇదివరకు ఎంతో మంది సెలెబ్రెటీలు చెప్పిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా బాలీవుడ్ నటుడు సాయి పల్లవి తన క్రష్ అంటూ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.ఇలా సాయి పల్లవి తన క్రష్ అంటూ సాయి పల్లవి పై ఉన్న ప్రేమను బయటపెట్టిన ఆ నటుడు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే… బాలీవుడ్ ఇండస్ట్రీలో గుల్షన్ దేవయ్యకు( Gulshan Devaiah ) నటుడిగా ఓ మంచి గుర్తింపు ఉంది.విభిన్నమైన పాత్రలు చేస్తూ అతడు బాలీవుడ్ ప్రేక్షలకు మనసు గెలుచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.
తాజాగా ఈయన దహాద్( Dahaad ) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇటీవల ఓ ఇంట్రర్వ్యూలో మాట్లాడుతూ.తెలుగు హీరోయిన్ సాయిపల్లవి అంటే చాలా ఇష్టమని, ఆమె తన క్రష్ అని చెప్పుకొచ్చాడు.
ఆమె అందం యాక్షన్ డాన్స్ కు తాను ఫిదా అయిపోయానని తెలియజేశారు.ఇక సాయి పల్లవి ఫోన్ నెంబర్ తన వద్ద ఉన్నప్పటికీ ఈ విషయాలు సాయి పల్లవికి చెప్పాలి అంటే తనకు చెప్పే ధైర్యం లేదంటూ ఈ సందర్భంగా దేవయ్య చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.