గల్ఫ్ లోని భారత ప్రవాసీయులకి పండగరోజులు

అదృష్టం అంటే గల్ఫ్ లో ఉన్న భారతీయులదనే చెప్పాలి.గల్ఫ్ లో ఉన్న ప్రతీ భారతీయుడు పంట పండింది.

డాలర్‌తో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉందన్న వార్తలు భారత దేశ ప్రజలలో ఆందోళన కలిగిస్తూ ఉంటే మరో పక్క గల్ఫ్ లో ఉన్న భారతీయులు మాత్రం పండగ వారతావరణం నెలకొంది డాలర్ కి అధిక మారక రేటు వస్తుండటంతో పెద్ద ఎత్తున తమ డబ్బుని స్వదేశంలోని తమ కుటుంబాలకి పంపుతున్నారు.

అయితే ఈ విధంగా భారతీయులు గడిచిన పదిహేను రోజలుగా గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు పంపే డబ్బులో హఠాత్తుగా 20-30 శాతం పెరుగుదల ఉన్నట్టు మనీ ఎక్స్చేంజ్ సంస్థలు చెబుతున్నాయి.ప్రవాస తెలుగువారు రూపాయి పతనాన్ని పూర్తిగా వాడేసుకుంటున్నారు.డాలర్ల రూపంలోని తమ డబ్బును ప్రవాహంలా సొంతవారికి పంపుతున్నారు.

తమ దగ్గరున్న మొత్తానికి మారకంలో కొన్ని రెట్ల మొత్తం పెరుగుతుండటంతో వారు అందినచోటల్లా డబ్బు తెచ్చి కుటుంబాలకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు.ఏడాది మొత్తంలో కష్టపడి నిల్వ చేసిన సొమ్ము మొత్తాన్ని ఒక్కసారిగా ఇంటికి పంపే వారు కొందరు అయితే మరి కొంతమంది మరికొందరు తెలుగువారు తమ ఆఫీసుల్లో అడ్వాన్సులు.

Advertisement

లోన్ల పేరిట డబ్బు తీసుకొని మరీ భారత్ కు తరలిస్తున్నారు.దుబాయ్.అబుదాబీ.

సౌదీ అరేబియా.అన్ని గల్ఫ్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది.

దేశంలో రూపాయి పడిపోవడం ఏమో కానీ గల్ఫ్ లో భారతీయులకి మాత్రం కాసులు కురిపించింది.

మా అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం.. కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో తీర్మానం
Advertisement

తాజా వార్తలు