లోకేష్ కి ఎంత కష్టం వచ్చింది..బాలయ్యకి వెన్నుపోటు తప్పదా

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది.రాజకీయ ప్రత్యర్ధులు తన మీద మాటల దాడి చేస్తుండడంతో దానికి ధీటుగా సమాధానం చెప్పలేక .

 Pawan Kalyan Throws Big Challenge To Lokesh-TeluguStop.com

సవాల్ ని ధైర్యంగా ఎదుర్కోలేక చినబాబు సతమతం అయిపోతున్నాడు.దొడ్డిదారిలో మంత్రి అయ్యావు అంటూ ప్రత్యర్ధులు పదే పదే విమర్శిస్తుండడంతో నా దారి అడ్డదారి కాదు .రహదారి అని లోకేష్ చుపించాలనుకుంటున్నాడు.అయితే ఆ రహదారి ఎక్కడ ఉంది అనేది మాత్రం ఇంకా వెతుక్కునే పనిలోనే ఆయన ఉండిపోయాడు.

ఈ వ్యవహారం టీడీపీ అధినేత చంద్రబాబు కి కూడా పెద్ద తలపోటు తెస్తోంది.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోకేష్ కి ఒక సవాల్ విసిరాడు.దొడ్డి దారిన మంత్రిగా చెలామణి అవ్వడం కాదు.దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజా తీర్పులో విజయం సాధిస్తారా అంటూ సూటిగా ప్రశ్నించడంతో లోకేష్ గందరగోళంలో పడ్డాడు.అందుకే… 2019 ఎన్నికల్లో ప్రత్యేక్ష ఎన్నికల్లో విజయం సాధించేలా లోకేష్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.తాను గెలవాలంటే ఏ నియోజకవర్గంలో ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే విషయాలపై పార్టీ సీనియర్ నేతలతో, తండ్రి చంద్రబాబుతో నూ తీవ్రంగా చర్చలు చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో నారాలోకేష్ సులభంగా గెలిచే నియోజక వర్గాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.పవన్ విసిరిన సవాల్ కు ధీటుగా సమాధానం చెప్పాలంటే లోకేష్ ఖచ్చితంగా గెలవాలి.

మరి ఈ నేపథ్యంలో లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.నారా లోకేష్ కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని మొదటి నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

కానీ చంద్రబాబుకు ఎంపీగా పోటీ చేయడం ఇష్టంలేదని, కుప్పం నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో లోకేష్ ఇంకో నియోజకవర్గం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మొదట లోకేష్ ని రాయలసీమ జిల్లాల నుంచి పోటీ చేయించేందుకు బాబు చూస్తుండగా అక్కడైతే జగన్ ప్రభావం ఎక్కువ ఉంది ఓడిపోయే పరిస్థితి వస్తుందని పార్టీ నేతలు చెప్పడంతో … అదే జిల్లాల్లో ఉన్న టీడీపీ కంచుకోట హిందూపురం నుంచి పోటీ చేస్తే ఇక తిరుగనుండదని బాబుకి నాయకులూ సూచించారట.

దీంతో ఆ సీటు లోకేష్ కి అని బాబు ఫిక్స్ అయిపోయాడు.ఆ సీటు మీద ఆశలు పెట్టుకున్న లోకేష్ మామ బాలకృష్ణకు ఏ రాజ్యసభ కానీ లేక ఎంఎల్సీ కానీ ఇచ్చి పక్కకు తప్పించాలని వ్యూహం పన్నుతున్నాడు బాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube