గుజరాత్‌ హైకోర్టు ఏం తేలుస్తుందో....!

గుజరాత్‌కు నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే రెండు వేల రెండో సంవత్సరంనాటి గుజరాత్‌ అల్లర్లపై కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

నరేంద్ర మోదీ ప్రధానిగా పదవి చేపట్టి ఏడాది దాటిపోయింది కూడా.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి గుజరాత్‌ అల్లర్లు నరేంద్ర మోదీని నరరూప రాక్షసుడిగా జనం ముందు నిలబెట్టాయి.ప్రతిపక్షాలు ఇప్పటికీ ఈ అల్లర్లను ప్రచారాస్ర్తంగా వాడుకుంటూనే ఉన్నాయి.

అయితే ఈ కేసులో కింది కోర్టు నరేంద్ర మోదీకి, మరో యాభై ఎనిమిది మందికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.దీనిపై బాధితుల్లో ఒకరైన జకియా జాఫ్రీ హైకోర్టులో గత ఏడాది మార్చిలో పిటిషన్‌ వేశారు.

దీనిపై తుది వాదనలు ఈరోజు (సోమవారం) జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గుజరాత్‌ అల్లర్లలో అరవైఎనిమిది మంది చనిపోయారు.

Advertisement

వారిలో జకియా జాఫ్రి భర్త, ప్రజాప్రతినిధి అయిన ఇషాన్‌ జాఫ్రి కూడా ఉన్నారు.అల్లర్లలో మోదీ తదితరులకు ప్రమేయం లేదని, ప్రభుత్వం అల్లర్లను నియంత్రించేందుకు చర్యలు తీసుకుందని, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రయత్నించిందని కింది కోర్టు పేర్కొంటూ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

గోద్రా ఘటన తరువాత రాష్ర్టంలో ఒక్కసారిగా మత కలహాలు భగ్గుమన్నాయి.ఈ ఘర్షణల్లో ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఒక వర్గాన్ని ఊచకోత కోయించారని, ఘర్షణలను ప్రోత్సహించారనే ఆరోపణలు వచ్చాయి.

విచిత్రమేమిటంటే ఈ ఘర్షణల తర్వాతే మోదీ రాజకీయంగా మరింత బలపడ్డారు.హైకోర్టు ఇచ్చే తీర్పుపై మోదీ రాజకీయ భవిష్యత్తు మరో మలుపు తిరిగే అవకాశముంటుందని అనుకుంటున్నారు.

కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?
Advertisement

తాజా వార్తలు