టీఆర్ ఎస్ టికెట్ కు పెరుగుతున్న డిమాండ్‌.. తెర‌మీద‌కు మ‌రో నేత‌!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఓ యుద్ధ‌వాతావర‌ణం హుజూరాబాద్ వేదిక‌గా జ‌రుగుతోంది.పార్టీల‌న్నీ సై అంటే సై అంటూ దూసుకుపోతున్నాయి.

ఈ ఎన్నిక‌లు ప్ర‌తి పార్టీకి అత్యంత కీల‌క‌మ‌నే చెప్పాలి.ఎందుకంటే టీఆర్ ఎస్ మీద స‌వాలు చేసి బీజేపీలో చేరిన ఈట‌ల రాజేంద‌ర్ ఈ ఎన్నిక‌ల్లో గెలిస్తే టీఆర్ ఎస్‌పై తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త వ‌చ్చే ఛాన్స్ ఉంది.

అలాగే టీఆర్ ఎస్ గెలిస్తే కూడా ఈట‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్‌, బీజేపీ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌నే చెప్పాలి.దీంతో ఈ ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలూ అత్యంత కీల‌కంగా తీసుకుంటున్నాయి.

ఇంకా నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల‌వ‌క ముందే అన్ని పార్టీలూ ఇంటింటి ప్ర‌చారం మొద‌లెట్టాయి.అయితే బీజేపీ అభ్య‌ర్థిగా ఈట‌ల రాజేంద‌ర్ బ‌రిలో ఉన్న‌ప్ప‌టికీ.

Advertisement

టీఆర్ ఎస్ నుంచి ఎవ‌రు పోటీ చేస్తార‌నేది మాత్రం ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేదు.ఎందుకంటే అధికార పార్టీ కావ‌డంతో చాలామంది పోటీ ప‌డుతున్నారు.

రోజుకో నేత పేరు వినిపిస్తోంది.ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో వ్య‌క్తి హైలెట్ అవుతున్నారు.

నిన్న మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌క్షంలో ట్ర‌స్టా క‌రీంన‌గ‌ర్ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌రావు ప్ర‌ధాన అనుచ‌రుడిగా పేరున్న సంజీవ‌రెడ్డి గులాబీ పార్టీలో చేరారు.

దీంతో ఆయ‌న‌కే టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.ఎందుకంటే ట్ర‌స్మా ఆధ్వ‌ర్యంలో మీటింగ్ పెట్టి మరీ టికెట్ ఇవ్వాల‌నే డిమాండ్ హ‌రీశ్‌రావు ముందు ఉంచిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.ఇదే జ‌రిగితే ట్ర‌స్మా త‌ర‌ఫున టీఆర్ ఎస్‌కు ప్ర‌చారం కూడా చేస్తామంటూ హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

అయితే ఇంత‌కుముందు ముద్ద‌సాని దామోద‌ర్‌రెడ్డి కొడుకు క‌శ్య‌ప్‌రెడ్డి, అలాగే ఆయ‌న అన్న పురోషోత్తం రెడ్డి పేర్లు కూడా వినిపించాయి.మ‌రి ఇప్పుడ ఎవ‌రికి టికెట్ ఇస్తార‌నేది కీల‌కంగా మారింది.

Advertisement

మ‌రి ఇంత పోటీలో ఈట‌ల‌ను ఢీకొట్టే నాయ‌కుడి కోసం టీఆర్ ఎస్ అధిష్టానం ప‌లు స‌ర్వేలు కూడా చేస్తోంది.చూడాలి మ‌రి ఫైన‌ల్‌గా టికెట్ ఎవ‌రికి ద‌క్కుతుందో.

తాజా వార్తలు