మలబద్ధకాన్ని దూరం చేసే ప‌చ్చి బ‌ఠాణీలు..ఎలా తీసుకోవాలంటే?

మలబద్ధ‌కం.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో నానా ఇబ్బందులు ప‌డుతుంటారు.

ఆహార‌పు అల‌వాట్లు, వేళ‌కు తీన‌క‌‌పోవ‌డం, శరీరానికి తగినంత శ్రమ ఇవ్వకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తీసుకోవ‌డం, మారిన జీవ‌న శైలి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.ఇక ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి.

అందుకే మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నివారించుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.అయితే మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డంలో కొన్ని ఆహారాలు ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.

అలాంటి వాటిలో ప‌చ్చి బ‌ఠాణీలు ఒక‌టి.కూర్మా, ఉప్మా, ఫ్రైడ్‌ రైస్, బిర్యానీ వంటి వాటిల్లో రుచి పెంచేందుకు ప‌చ్చి బ‌ఠాణీలను విరి విరిగా ఉప‌యోగిస్తుంటారు.

Advertisement

అయితే రుచిలోనే కాదు.ప‌చ్చి బ‌ఠాణీల్లో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.

విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబ‌ర్ ఇలా అనేక పోష‌కాలు ప‌చ్చి బ‌ఠాణీల్లో ఉంటాయి.

అందుకే ప‌చ్చి బ‌ఠాణీలు ఆరోగ్యానికి మేలని నిపుణులు చెబుతుంటారు.ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ధకం స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు ప్ర‌తి రోజు ప‌చ్చి బఠాణీల‌ను ఉడికించి తీసుకోవ‌డం లేదా వాటిలో సూప్ త‌యారు చేసి తీసుకోవ‌డం లేదా ఆకుకూరలు, కూరగాయలతో కలిపి కూరగా చేసుకుని తీసుకోవ‌డం చేయాలి.ఇలా ఎలా చేసి తీసుకున్నా.

ప‌చ్చి బ‌ఠాణీల్లో పుష్క‌లంగా ఉండే ఫైబ‌ర్ కంటెంట్ మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను నివారిస్తుంది.అంతేకాదు, జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగుబ‌డుతుంది.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఇక ప‌చ్చి బ‌ఠాణీలు త‌ర‌చూ తీసుకుంటే కంటి ఆరోగ్యానికి కాపాడే కెరోటిన్,‌ ల్యూటెన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరానికి అందుతాయి.పైగా ప‌చ్చి బ‌ఠాణీలు తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

‌‌.

తాజా వార్తలు