గ్రీన్ హైడ్రోన్ అంటే ఏమిటి? అది వాహ‌నాన్ని ఎలా ముందుకు న‌డిపిస్తుందంటే..

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఎఫ్‌సీఈవీ)లో పార్లమెంటు భవనానికి చేరుకున్నారు.ఇది చర్చనీయాంశంగా మారింది.

 Green Hydrogen How It Is Working As Petrol Green Hydrogen, Cars , Electric Vechi-TeluguStop.com

ఎలక్ట్రిక్ వాహనాల తర్వాత, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వాహనాలు గురించి చ‌ర్చ జ‌రుగుతోంది.ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ హైడ్రోజన్ స్వచ్ఛమైన శక్తి వనరు.గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్- ఆక్సిజన్ నీటి నుండి వేరు చేస్తారు.

ఈ ప్రక్రియలో ఎలక్ట్రోలైజర్ ఉపయోగిస్తారు. ఎలక్ట్రోలైజర్ పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తుంది.

ఇందులో సౌర, పవన శక్తి రెండూ ఉంటాయి.హైడ్రోజన్ అనేక రంగాలలో ఉపయోగిస్తున్నారు.

వీటిలో రసాయనాలు, ఇనుము, ఉక్కు, రవాణా మొద‌లైన‌వి ఉన్నాయి.హైడ్రోజన్ వాడకం వల్ల కాలుష్యం కూడా వ్యాపించదు.

గత కొన్నేళ్లుగా ప్రపంచంలోని పెద్ద పెద్ద చమురు, గ్యాస్ కంపెనీలు కూడా ‘గ్రీన్ హైడ్రోజన్స‌పై దృష్టి సారిస్తున్నాయి.అన్నింటికీ విద్యుత్తు ఉపయోగించ‌లేమ‌ని నిపుణులు భావిస్తున్నారు.

అటువంటి పరిస్థితిలో గ్యాస్‌ను కొన్ని పారిశ్రామిక ప్రక్రియలు, భారీ రవాణా కోసం ఉపయోగించవచ్చు.పునరుత్పాదక హైడ్రోజన్ ఇందులో ఉత్తమమైన వాయువు.ఇది పూర్తిగా ప‌రిశుభ్రంగా ఉంటుంది.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపిన వివ‌రాల ప్రకారం కాలుష్య ముప్పును ఎదుర్కోవటానికి మ‌నం ఇథనాల్, మిథనాల్, బయో-డీజిల్, బయో-సీఎన్‌జీ, బయో-ఎల్‌ఎన్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్‌ల దిశ‌గా మారుతున్నాము.

3000 కోట్లతో హైడ్రోజన్ మిషన్‌ను ప్ర‌భుత్వం ప్ర‌కటించింది.సాంకేతిక, హరిత ఇంధనాలలో వేగవంతమైన అభివృద్ధి ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ ధరలను తగ్గిస్తుంది.

గరిష్ఠంగా రెండేళ్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు, ఆటో రిక్షాల ధర పెట్రోలుతో నడిచే స్కూటర్లు, కార్లు, ఆటో రిక్షాల ధరలకు సమానంగా ఉంటుందని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు.లిథియం అయాన్ బ్యాటరీ ధరలు తగ్గుతున్నాయి.

అలాగే జింక్-అయాన్, అల్యూమినియం-అయాన్, సోడియం-అయాన్ బ్యాటరీ కెమిస్ట్రీని అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube