జనగనణలో బీసీల గణన చేపట్టాలని ఢిల్లీలో మహా ధర్నాలు...

దేశ వ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీల గణన చేపట్టాలని,చట్ట సభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లు పెంచాలనే ప్రధాన డిమాండ్లతో ఢిల్లీలో ఈనెల 28న మహా ధర్నా, 29న బీసీల జనగణన దీక్షను చేపట్టాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు.

శనివారం మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ కులగణన చేపడతామని మాట ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం, నేడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.

కేంద్రంలో బీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని డిమాండ్ చేశారు.అన్ని వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచినా, బీసీలకు పెంచడంలేదని, చట్టసభలలో బీసీలను 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో సంవత్సరాలుగా బీసీలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్రంలో కనీసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

బీసీ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదని వాపోయారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండు రోజుల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,ఈ ఆందోళనలో దేశంలోని 29 రాష్టాల నుండి బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని,28,29 తేదీలలో జరిగే దీక్షలు, ధర్నాలలో బీజేపీ పార్టీ ప్రతినిధుల మినహా, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, పార్లమెంటరీ పక్షనేతలను ఆహ్వానిస్తామని తెలిపారు.

పార్లమెంట్ బడ్జేట్ సమావేశాలు మొదలై మూడు రోజులు కావస్తున్నా ఆదాని, రాహుల్ గాంధీల రాగం తప్ప,బీసీల సమస్యలపై పార్లమెంటులో కనీస చర్చ జరగడం లేదని విమర్శించారు.బీసీలకు న్యాయం చేయాల్సిన అధికారపక్షం చేయకపోతే, అడగాల్సిన ప్రతిపక్షాల అడగడం లేదని,బీసీలు అంటే అన్ని పార్టీలకు చిన్న చూపైందన్నారు.

Advertisement

ఈ నెలలో 28,29 తేదీలలో జరిగే బీసీల ఉద్యమానికి బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,మహేష్ గౌడ్, అంజి యాదవ్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

Latest Suryapet News