ఆటబొమ్మ చూసి చిరుప్రాయంలోకి వెళ్లిపోయిన బామ్మ.. ఆమె రియాక్షన్ చూస్తే...

అమ్మమ్మలు, మనవళ్ల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది.అమ్మమ్మలు కథలు చెప్పడం, స్నాక్స్ ఇవ్వడం, వంటకాలు నేర్పించడం, కౌగిలింతలు ఇవ్వడం ద్వారా తమ ప్రేమను చూపుతారు.

వారు తమ జీవితంలో చాలా కష్టాలు పడినా ఆ బాధను చూపించకుండా తమ మనవళ్లు, మనవరాళ్లను ఎంతో హ్యాపీగా చూసుకుంటారు, వారు ఎప్పుడూ నవ్వుతూ, మనల్ని సంతోషపరుస్తారు.అంత చేసే వారి కోసం చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లు ఇచ్చి వారిని కూడా సంతోషపెట్టే ప్రయత్నం చేయాలి.

తాజాగా ఇదే పనిని ఒక చిన్నారి చేసి తన అమ్మమ్మకు ( grandmother )మర్చిపోలేని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.ఆ అమ్మమ్మ చిన్నప్పుడు ఆ బొమ్మను కొనాలని ఎంతో ఆశపడిందట.

కానీ డబ్బు లేక దానిని కొనలేకపోయింది.దాంతో మనవరాలు అమ్మమ్మకి ఆట బొమ్మ( game toy ) ఇచ్చి సంతోష పెట్టింది.

Advertisement

ఆ బామ్మ రియాక్షన్ ను కూడా వీడియోలో క్యాప్చర్ చేసింది.

వీడియోలో అమ్మమ్మ గిఫ్ట్ బాక్స్ తెరిచి చూడగా లోపల బొమ్మ కనిపించింది.ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.బొమ్మను కౌగిలించుకుంది.

ఆమె తన భర్త, ఇతర కుటుంబ సభ్యులకు చూపించింది."గుడ్ న్యూస్ మూవ్‌మెంట్"( Good News Movement ) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఈ వీడియో పోస్ట్ చేసింది.

ఈ వీడియో చూసిన చాలా మంది ఫిదా అయ్యారు."ఈ బొమ్మ చూడగానే బామ్మ లోపల ఉన్న చిన్నారి బయటికి వచ్చింది.

యూఎఫ్‌సీ వద్ద డొనాల్డ్ ట్రంప్‌కు ఘనస్వాగతం .. కోర్టు దోషిగా తేల్చినా ఈ స్థాయిలో క్రేజా
వైరల్ వీడియో : రోహిత్ అభిమానిని చితకబాదిన అమెరికా పోలీసులు..

" అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు."ఇదొక బ్యూటిఫుల్ మూమెంట్.

Advertisement

సంతోషాన్ని గుండెల్లో నింపుకునేందుకు ఏదైనా సరైన సమయమే.సంవత్సరాలు గడిచినా ఆమె తన ఆనందాన్ని, ఉత్సాహాన్ని కోల్పోకుండా చూడటం చాలా అద్భుతంగా ఉంది.

గాడ్ బ్లెస్ హర్" అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు