ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ముఖ్యమంత్రి జగన్ ఏకంగా ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
దానికి అడ్డుగా ఉన్న సిఆర్డీఏ బిల్లుని కూడా రద్దు చేస్తూ జీవో జారీ చేశారు.ఇక అప్పటి నుంచి అమరావతి రైతుల ఆందోళనతో అట్టుడుకుతోంది.
అయితే రాజధానుల విషయంలో జగన్ తన పంతం నెగ్గించుకోవడానికే ఆసక్తి చూపించాడు.రైతుల ఉద్యామాలని అసలు పట్టించుకోలేదు.
ఎట్టి పరిస్థితిలో మూడు రాజధానులు చేసి తీరుతాం అని తీర్మానించారు.ఇక అందులో భాగంగా ఇప్పటికే విశాఖని పరిపాలనా రాజధానిగా మార్చి దానికి సంబందించిన కార్యాచరణ అంతా సిద్ధం చేసేశారు.
ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు.దాంతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా ఆయన ఆమోదించారు.
దీం ఇప్పటివరకూ ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి ఇక నుంచి శాసన రాజధానిగా మాత్రమే ఉంటుంది.ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు మారిపోయాయి.
వికేంద్రీకరణ బిల్లును 3 వారాల క్రితం జగన్ సర్కార్ గవర్నర్‌కు పంపింది.గవర్నర్ దీనిని ఆమోదించడంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయినట్టయింది.
అయితే ఇప్పుడు గవర్నర్ బిల్లు ఆమోదించడంతో మరోసారి అమరావతిలో రైతులు ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది.దీనిపై రోడ్డెక్కే పరిస్థితి రానుంది.
అయితే తెలుగు దేశం పార్టీ వెనకుండి అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తుందని ఆరోపణలు చేస్తున్న వైసీపీ దీనిపై ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.అలాగే రైతులకి అన్యాయం జరగనివ్వను అని చెప్పిన పవన్ కళ్యాణ్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
.