టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని, అగ్ర హీరో బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వీర సింహారెడ్డి.ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
జనవరి 12న సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ సాంగ్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఈ సినిమాకి ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని బాలయ్య బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
కాగా ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టు కొట్టడం గ్యారంటీ అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.
బాలయ్య బాబు మనసు బంగారం.ఆయన్ని ఒక కంటితో చూస్తూనే మరొక కంటితో సినిమాను డైరెక్ట్ చేశాను.
హీరోయిన్ శృతిహాసన్ తో మూడో సినిమా తీస్తున్నాను.ఆమె చాలా బాగా నటించింది.
అంతేకాకుండా శృతిహాసన్ నాకు లక్కీ హీరోయిన్.హనీ రోజ్ అద్భుతంగా నటించింది అని చెప్పుకొచ్చారు గోపీచంద్ మలినేని.
అలాగే ఈ సినిమాల్లో వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య బాబును ఢీ కొడుతోంది.

బుర్ర సాయి మాధవ్ అద్భుతంగా డైలాగ్స్ ను రాశారు.నా టీం అంతా బాలయ్య బాబు ఫ్యాన్సే.అభిమానులు అందరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో అదే వీర సింహారెడ్డి సినిమా.
ఈ సినిమా కోసం పనిచేసిన అందరూ నా వెనక నిలబడ్డారు.బాలయ్య బాబు మనసు చాలా మంచిది.
ఆయనకు చేతులెత్తి నమస్కరించాలి.నేను పుట్టిన గడ్డమీద నాకు నచ్చిన హీరో తో నా సినిమా ఫంక్షన్ చేసుకుంటున్నాను.
ఇంతకంటే నా జీవితానికి ఇంకేం కావాలి అని తెలిపారు గోపీచంద్.అలాగే మా బావ తమన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అని చెప్పుకొచ్చాడు గోపీచంద్ మలినేని.
కాగా తాజాగా విడుదలైన వీర సింహారెడ్డి ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది దూసుకుపోతోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని బాలయ్య బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.







