శేఖర్ మాస్టర్ కు షాకిచ్చిన గూగుల్.. అప్పుడే చనిపోయారంటూ..?

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు కాగా శేఖర్ మాస్టర్ స్టెప్పులు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువ సినిమాలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు.

కొందరు టాలీవుడ్ హీరోలకు శేఖర్ మాస్టర్ ఫేవరెట్ కొరియోగ్రాఫర్ కావడం గమనార్హం.అయితే గూగుల్ లో శేఖర్ మాస్టర్ వివరాలు తప్పుగా కనిపిస్తున్నాయి.

శేఖర్ మాస్టర్ కు ఒక విధంగా గూగుల్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

శేఖర్ మాస్టర్ 1963లో జన్మించారని 2003 సంవత్సరం జులై 8వ తేదీన ఆయన చనిపోయారంటూ గూగుల్ చూపిస్తోంది.ఇలా గూగుల్ వివరాలను తప్పుగా చూపిస్తూ ఉండటంతో శేఖర్ మాస్టర్ అభిమానులు కంగారు పడుతున్నారు.గూగుల్ తప్పును సరిదిద్దుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

Advertisement

శేఖర్ మాస్టర్ ఫోటోను కరెక్ట్ గానే చూపిస్తున్నప్పటికీ జననమరణ వివరాలను మాత్రం గూగుల్ తప్పుగా చూపిస్తుండటం గమనార్హం.

అయితే గూగుల్ ఈ విధంగా శేఖర్ మాస్టర్ గురించి తప్పుగా చూపించడానికి మరో రీజన్ కూడా ఉంది.తమిళనాడుకు చెందిన ఆర్టిస్ట్ లలో ఒకరైన జేవీ శేఖర్ ను అభిమానులు మాస్టర్ శేఖర్ అని పిలిచేవారు.ఈయన దాదాపు 50కు పైగా సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

అయితే వికీపీడియా పొరపాటుగా ఒక శేఖర్ మాస్టర్ ఫోటోకు బదులుగా మరో శేఖర్ మాస్టర్ ఫోటోను అప్ లోడ్ చేసింది.శేఖర్ మాస్టర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గూగుల్ తప్పును సరిదిద్దుకుంటుందేమో చూడాలి.

శేఖర్ మాస్టర్ స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపును సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడ్డారు.ప్రస్తుతం ఒక్కోపాటకు 5 లక్షల రూపాయలకు పైగా శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

శేఖర్ మాస్టర్ పలు రియాలిటీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు