గత పది నెలలకు పైనుండి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభన ఎంతోమందిని రోడ్డుపాలు చేసింది.ఎంతోమంది ప్రాణాలను కూడా పొట్టనపెట్టుకుంది.
ఇకపోతే ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారికి సంబంధించిన వ్యాక్సిన్ లు ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీల నుంచి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.అయితే ఏ ఒక్క వ్యాక్సిన్ పూర్తిగా విజయవంతం అయిందని చెప్పలేకపోతున్నారు.
ఇకపోతే ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు వారి ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయడానికి అవకాశాన్ని ఇచ్చాయి.ఇందులో భాగంగానే టెక్ దిగ్గజం అయిన గూగుల్ సంస్థ వారి ఉద్యోగులకు వచ్చే 2021 జూన్ వరకు వర్క్ ఫ్రొం హోమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ విషయం అలా ఉండగా తాజాగా గూగుల్ సంస్థ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు సంస్థ సీఈవో సుందర్ పిచాయ్.ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకోవచ్చని.
ఇప్పటికి కరోనా పూర్తిగా తగ్గలేదని అందుకు కారణంగా జూన్ 2021 వరకు మాత్రమే కాకుండా సెప్టెంబర్ 2021 వరకు దానిని పొడిగించినట్లు గూగుల్ సంస్థ తెలియజేసింది.ఇందుకు సంబంధించి ఇప్పటికే గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ వారి ఉద్యోగులకు ఈమెయిల్స్ కూడా పంపించినట్లు సమాచారం.
వీటితోపాటు గూగుల్ సంస్థ వారి ఉద్యోగులకు మరో చక్కని అవకాశాన్ని కూడా కల్పించింది.వారంలో మూడు రోజులు ఆఫీసుకు వస్తే సరిపోతుందని మిగతా రోజులు ఇంటి వద్దనే ఉండి పని చేసుకోవచ్చని తెలియజేసింది.

కరోనా వైరస్ కారణంగా గూగుల్ ఉద్యోగులు కార్యాలయాలకు రావడానికి ఇబ్బంది పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.అయితే, కరోనా వ్యాక్షిన్ పూర్తిగా అందుబాటులోకి వస్తే తిరిగి మళ్లీ ఐటి దిగ్గజ కంపెనీలన్నీ వాటి కార్యకలాపాలను పూర్తిగా కొనసాగిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.ఈ నిర్ణయంతో గూగుల్ ఉద్యోగులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా కేవలం గూగుల్ సంస్థ మాత్రమే కాకుండా అన్ని దిగ్గజ కంపెనీలు వారి ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి అవకాశాలను కల్పించడం మాత్రమే కాకుండా.
వారానికి ఇన్ని రోజులు మాత్రమే ఆఫీస్ కు వస్తే సరిపోతుంది అంటూ వారి ఉద్యోగులకు తెలుపుతున్నారు.