గూగుల్ పే యూజర్లకు గుడ్‌ న్యూస్..!

తమ యూజర్లకు గూగుల్ పే గుడ్ న్యూస్ అందించింది.యూపీఐ చెల్లింపుల్లో ట్యాప్ టు పే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ట్యాప్ టు పే ద్వారా చెల్లింపులు చాలా ఫాస్ట్‌గా జరుగుతాయి.ఇప్పటి వరకు ఈ సౌకర్యం డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంలో మాత్రమే అందుబాటులో ఉంది.

అటువంటి సౌకర్యాన్ని యూపీఐ చెల్లింపుల్లో ప్రవేశపెట్టేందుకు గూగుల్ పే చర్యలు తీసుకుంటోంది.ఇందుకోసం పైన్ ల్యాబ్ సహకారం తీసుకోనుంది.

నగదు చెల్లింపును పూర్తి చేయడానికి, వినియోగదారులు పీఓఎస్ టెర్మినల్‌లో వారి ఫోన్‌ నంబరును జోడించాలి.వారి ఫోన్ నుండి చెల్లింపును నిర్ధారించుకోవాలి.

Advertisement

ఆ తర్వాత యూపీఐ పిన్‌ని ఉపయోగించి, ఎంపిక చేసిన నగదును చెల్లించవచ్చు.లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, చెల్లింపు పూర్తి చేయొచ్చు.

ట్యాప్ టు పే చెల్లింపుల్లో భాగంగా ఎన్ఎఫ్‌సీ సాంకేతికతను ఉపయోగించి కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయొచ్చు.ఎన్‌క్రిప్ట్‌తో కూడిన అత్యంత సురక్షితమైన ఈ సేవలను యూపీఐ యూజర్లకు గూగుల్ పే తీసుకు రావడం గొప్ప ముందడుగుగా పలువురు వర్ణిస్తున్నారు.

ఈ సేవలు ప్రస్తుతం రిలయన్స్ రిటైల్‌, ఫ్యూచర్ రిటైల్, స్టార్‌ బక్స్ వంటి పెద్ద వ్యాపార సంస్థలు వినియోగించుకుంటున్నాయి.ట్యాప్ టు పే విధానం వల్ల రిటైల్ అవుట్ లెట్‌ల వద్ద పెద్ద ఎత్తున క్యూలు తప్పే అవకాశం ఉంది.వెంటవెంటనే చెల్లింపులు పూర్తవడం వినియోగదారులకు విలువైన సమయం ఆదా అవుతుంది.

పైన్ ల్యాబ్స్ సహకారంతో భారతదేశంలో యూపీఐ చెల్లింపులకు ట్యాప్ టు పే విధానాన్ని తొలిసారి తీసుకురావడంపై చాలా సంతోషంగా ఉందని గూగుల్ పే బిలియన్ యూజర్ ఇనిషియేటివ్స్ బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఒన్స్ మోర్ నీరజ్ చోప్రా.. మళ్లీ గోల్డ్ కొట్టేనా.? ఒలంపిక్స్ లో నేటి భారత్ ఈవెంట్స్ ఇవే..
Advertisement

తాజా వార్తలు