అమెరికా వెళ్లాలనుకునే తెలుగు విద్యార్ధులకు గుడ్ న్యూస్..!!

అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో ఉన్నత చదువులు చదవాలని అలాగే చదువు పూర్తయిన తరువాత అక్కడి కంపెనీలలో స్థిరపడాలని ఎంతో మంది విదేశీ విద్యార్ధులు కలలు గంటూ ఉంటారు.

ముఖ్యంగా అమెరికాకు వలస వెళ్లి చదువుకునే వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు ఎక్కువగా ఉంటారు.

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అమెరికాలో ఉన్నత పదవులను చేపట్టిన తెలుగు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.అయితే తాము చదివిన చదువులకు అమెరికాలో ఎలాంటి యూనివర్సిటీలలో చోటు సంపాదించవచ్చు, అలాగే ఏ అర్హతలు ఉన్న వాళ్ళు ఏఏ యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవాలనే అవగాహన మాత్రం ఎవరికీ ఉండకపోవడంతో ఎంతో మంది తెలుగు విద్యార్ధులు నష్టపోతున్నారు.

ఇలాంటి పరిస్థితులును విద్యార్ధులు దేశం కాని దేశంలో ఎదుర్కోవాలంటే తప్పకుండా అమెరికాలో విద్య, విధ్యాలయాలపై అవగాహన ఉండాల్సిందే.ఈ విషయాన్ని గ్రహించిన అమెరికా ఎడ్యుకేషనల్ సంస్థ హైదరాబాద్ లో ఉచితంగా సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

సదరు సంస్థ అమెరికాలో అమెరికా ప్రభుత్వ పర్యవేక్షలో పనిచేస్తుంది.మన దేశంలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ లో ఏర్పాటు చేయడంతో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో రేపని రోజున కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.విద్యార్ధుల అన్ని రకాల సందేహాలను నివృత్తి చేస్తూ, సూచనలను ఇవ్వడానికి ఈ సేవా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు ప్రకటించారు.

అయితే ఈ సేవా కేంద్రం వారాంతరంలో కేవలం ఒక్క రోజు మాత్రం ఉంటుందని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంటుందని , వారంలో కేవలం ఒకరోజు మాత్రమే సేవా కేంద్రం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు