ఆ పాము ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

పాములని సాధారణంగా సరిసృపాలు అంటారు.వీటిలో వేల రకాల పాములు జాతులు ఉంటాయి.

 Golden Tree Snake Identified-TeluguStop.com

అందులో విష సర్పాలతో పాటు, విషరహిత సర్పాలు కూడా ఉంటాయి.అయితే సాధారణంగా పాములు రక్తపింజరు, నల్ల రక్త పింజేరు, తాచుపాము, కట్లపాము వంటి పాములనే మాత్రమే చూస్తూ ఉంటారు.

అప్పుడప్పుడు అరుదైన పాముల్ని కూడా చూస్తూ ఉంటాం.సోషల్ మీడియా పుణ్యమాని వింత పాములు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూడగలుగుతున్నాం.

కర్ణాటకలో ఉడిపికి సమీపంలోని మల్పె అనే గ్రామం ఉంది.ఈ ఊరు అడవికి దగ్గరగా ఉంది.

కొద్దీ రోజులుగా అడవిలో ఉండే పాములు ఊళ్లలోకి వస్తూ ఉంటాయి.ఈ క్రమంలో మల్పె లోని ఓ హోటల్ లో అరుదైన రంగురంగుల పాము దర్శనమిచ్చింది.

ఓ హోటల్‌ యజమాని తెచ్చిన కూరగాయల బుట్టలో ఓ అరుదైన పాము ప్రత్యక్షం అయింది.దాన్ని చూడగానే భయపడ్డ యజమాని పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించాడు.

ఆ పాము శరీరంపై ఎరుపు, నలుపు, తెలుపు మచ్చలున్నాయి.కాగా ఒటికన్నర మీటరు పొడవున్న ఈ పాము విషపూరితం కాదని, వీటిని స్థానికులు గోల్డెన్‌ ట్రీ స్నేక్‌ పిలుస్తారని తెలుస్తుంది.

ఇవి ఎక్కువగా పాడుబడ్డ చెట్ల తొర్రల్లో జీవిస్తుంటాయని అన్నారు.ఈ పామును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube