ఆ పాము ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
TeluguStop.com
పాములని సాధారణంగా సరిసృపాలు అంటారు.వీటిలో వేల రకాల పాములు జాతులు ఉంటాయి.
అందులో విష సర్పాలతో పాటు, విషరహిత సర్పాలు కూడా ఉంటాయి.అయితే సాధారణంగా పాములు రక్తపింజరు, నల్ల రక్త పింజేరు, తాచుపాము, కట్లపాము వంటి పాములనే మాత్రమే చూస్తూ ఉంటారు.
అప్పుడప్పుడు అరుదైన పాముల్ని కూడా చూస్తూ ఉంటాం.సోషల్ మీడియా పుణ్యమాని వింత పాములు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూడగలుగుతున్నాం.
కర్ణాటకలో ఉడిపికి సమీపంలోని మల్పె అనే గ్రామం ఉంది.ఈ ఊరు అడవికి దగ్గరగా ఉంది.
కొద్దీ రోజులుగా అడవిలో ఉండే పాములు ఊళ్లలోకి వస్తూ ఉంటాయి.ఈ క్రమంలో మల్పె లోని ఓ హోటల్ లో అరుదైన రంగురంగుల పాము దర్శనమిచ్చింది.
ఓ హోటల్ యజమాని తెచ్చిన కూరగాయల బుట్టలో ఓ అరుదైన పాము ప్రత్యక్షం అయింది.
దాన్ని చూడగానే భయపడ్డ యజమాని పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించాడు.ఆ పాము శరీరంపై ఎరుపు, నలుపు, తెలుపు మచ్చలున్నాయి.
కాగా ఒటికన్నర మీటరు పొడవున్న ఈ పాము విషపూరితం కాదని, వీటిని స్థానికులు గోల్డెన్ ట్రీ స్నేక్ పిలుస్తారని తెలుస్తుంది.
ఇవి ఎక్కువగా పాడుబడ్డ చెట్ల తొర్రల్లో జీవిస్తుంటాయని అన్నారు.ఈ పామును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
మెరూన్ రంగు లో డ్రెస్ లో హీట్ పుట్టిస్తున్నకృతి శెట్టి ..