మొసలి కాలితో వంటకం.. అసలు ఇదేమి కాంబినేషన్..

ఇటీవల సోషల్ మీడియాలో అనేక వెరైటీ వంటకాలు( Strange Dish ) చూస్తున్నాం.వినూత్న ఫుడ్ కాంబినేషన్లతో చేసిన వంటకాలు వైరల్ అవుతున్నాయి.

ఎవరూ ఊహించని వివిధ పదార్థాలు కలిపి వంటకాలు చేస్తోన్నారు.ఇటీవల ఆయిల్ తో కాకుండా బీర్ తో ఎగ్ ఆమ్లెట్ తయారుచేస్తున్న ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది.

ఈ వీడియోలో ఆయిల్ బదులు పెనంపై బీర్ పోసి ఎగ్ ఆమ్లెట్ తయారుచేస్తుండగా.కొత్తగా ఉండటంతో మందుబాబులు ఎగబడి తింటున్నారు.

అయితే తాజాగా మరో వెరైటీ కాంబినేషన్ ఫుడ్ వైరల్ గా మారింది.మొసలి కాలితో( Crocodile Legs ) తయారుచేసిన ఒక వంటకం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

ఒక రెస్టారెంట్‌లో( Restaurant ) మొసలి కాలితో తయారుచేసిన వంటకాన్ని వండుతున్నారు.వండి కస్టమర్లకు సర్వ్ కూడా చేస్తున్నారు.చూడటానికి చాలా వింతగా, వికారంగా ఇది ఉంది.

ఈ వంటకానికి గాడ్జిల్లా రామెన్( Godzilla Ramen ) అనే పేరు కూడా పెట్టారు.మొసలి కాలిని ఆవిరి చేయడం ద్వారా ఈ వంటకాన్ని తయారుచేస్తున్నారు.

దాదాపు 40 రకాల మసాలాలు ఈ వంటకంలో వాడతారట.ప్లేట్ లో మొసలి కాలిని పెట్టి ఈ వంటకం సర్వ్ చేస్తున్నారు.

ఇది చూసి చాలామంది షాక్ కు గురవుతున్నారు.మరికొంతమంది అయితే మొసలి కాలిని చూసి భయపడుతున్నారు కూడా.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
వైరల్ వీడియో : మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?

తైవానీస్ రెస్టారెంట్ లో గాడ్జిల్లా రామెన్ అనే ఈ వంటకాన్ని తయారుచేస్తున్నారు.కొంతమంది ఈ వంటకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ వీడియోలో సర్వ్ చేసిన ప్లేట్ లో నల్లగా ఉండే మొసలి కాలి కనిపిస్తుంది.

Advertisement

ఇదేమి వంటకం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు.ఇది తింటే అసలు మనిషి బ్రతుకుతాడా అంటూ మరికొందరు కామెంట్ చేస్తోన్నారు.

తాజా వార్తలు