వీళ్లు మంత్రులా? రాక్షసులా?

మన రాజకీయ నాయకులంత దుర్మార్గులు, సంస్కారహీనులు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమోననిపిస్తోంది.

గల్లీ నాయకుల నుంచి ఢిల్లీ నాయకుల వరకు, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న మంత్రులు సైతం చేస్తున్న అసందర్భ, అవాంఛనీయ వ్యాఖ్యలు వింటుంటే వీరిని ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది.

కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు పిరికివాళ్లని, నేరగాళ్లని హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యానించి తన సంస్కారహీనత్వాన్ని చాటుకున్నాడు.

ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం చేయకూడదన్నాడు.ఈ వ్యాఖ్యల వేడి ఇంకా కొనసాగుతుండగానే పంజాబ్‌ విద్యా శాఖ మంత్రి సుర్జీత్‌ సింగ్‌ రఖ్‌రా మరీ ఘోరమైన వాఖ్యలు చేశాడు.

మొన్నీమధ్య ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కుటుంబానికి చెందిన బస్సులో కొందరు ముష్కరులు పద్నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించి ప్రతిఘటించడంతో ఆమెను బస్సు కిటీకీలో నుంచి రోడ్డు మీదికి విసిరేయడంతో అక్కడికక్కడే చనిపోయిన సంగతి తెలిసిందే.దీనిపై రాష్ర్ట విద్యా శాఖ మంత్రి మాట్లాడుతూ ఈ సంఘటన జరగడం దేవుడి కోరిక అని వ్యాఖ్యానించారు.

Advertisement

దేవుడి సంకల్పానికి ఎవరూ ఎదురు నిలవలేరని అంటూ కార్లకు, విమానాలకు ప్ర మాదాలు జరుగుతున్నాయని, ఇలాంటివన్నీ దేవుడికి వదిలేయాలని అన్నారు.ఎమ్మెల్యే జోగిందర్‌ పాల్‌ మాట్లాడుతూ అనేక ప్రమాదాలు జరుగుతుంటాయని, రెండు వర్గాలవారు కోర్టు బయట రాజీ పడితే పరిహారం చెల్లించవచ్చని అన్నారు.

ఇలాంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉంటే ముష్కరులకు భయమేముంది? నేరగాళ్లను పట్టుకొని శిక్షించాలిగాని వారికే వత్తాసు పలుకుతున్నారు.వీళ్లు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులనడంలో సందేహంలేదు.

Advertisement

తాజా వార్తలు