పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా గురించే ప్రస్తుతం అందరు మాట్లాడు కుంటూ ఉన్నారు.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మల్టీ స్టారర్ గా రూపొందుతుంది.
పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతుంది.ఈ క్రమంలో వరుస ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్.
నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా చేసారు.ఈ వేడుక యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తో పాటు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని హాజరయ్యారు.
ఇక రేపే రిలీజ్ కావడంతో ఈ సినిమాను ఈ రోజు మరింత ప్రోమోట్ చేయడానికి చిత్ర యూనిట్ మరింత కృషి చేస్తున్నారు.
ఇక బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం అబ్బాయి రామ్ చరణ్ కూడా తన వంతు ఈ సినిమాను ప్రోమోట్ చేయడానికి సాయం చేస్తున్నాడు.నిన్న భీమ్లా నాయక్ ట్రైలర్ రివ్యూ ఇచ్చిన రామ్ చరణ్ తాజాగా మరొక వీడియో షేర్ చేసి భీమ్లా నాయక్ ప్రొమోషన్ లో తన వంతు సాయం అందిస్తున్నాడు.
తాజాగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసాడు.ఈ వీడియోలో మెగా బ్రదర్స్ ఇద్దరు ఒక చోట కలిసి మాట్లాడు కుంటున్నారు.మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ షూటింగ్ కోసం, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ షూటింగ్ చేస్తున్న సమయంలో సెట్స్ లో జరిగిన ఒక మూమెంట్ ను వీడియో రూపంలో షేర్ చేసాడు రామ్ చరణ్.
ఇందులో చిరంజీవి పవన్ తో పాటు రానా, త్రివిక్రమ్, సాగర్ కే చంద్ర కూడా ఉన్నారు.వీరందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు.ఈ వీడియోను చరణ్ గాడ్ ఫాదర్ తో భీమ్లా నాయక్ అని పోస్ట్ చేసారు.
ఈ వీడియో కొద్దీ సేపటి క్రితమే షేర్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది.ఈ వీడియోను బట్టి చుస్తే మెగాస్టార్ గాడ్ ఫాదర్ షూటింగ్ లో ఉన్నప్పుడు భీమ్లా నాయక్ సెట్స్ లో సందడి చేసినట్టు కనిపిస్తుంది.