మాల్దీవులు వెళ్లాలనుకునే హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..

చాలామంది సమయం దొరికినప్పుడల్లా ఎక్కడో చోటకు విహారయాత్రకు వెళ్లాలని అనుకుంటారు.ఎక్కువగా సెలెబ్రిటీలు షూటింగ్ కొద్దిగా గ్యాప్ వచ్చిన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు.

ఈ మధ్య సెలెబ్రిటీల నోటా ఎక్కువగా వినిపించే పేరు మాల్దీవులు.ఇది చాలా మందికి ఫేవరైట్ స్పాట్ గా మారిపోయింది.

లాక్ డౌన్ తర్వాత చాలామంది సెలెబ్రిటీలు ఇక్కడకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు.ఇక్కడ సముద్రతీరాల్లో సేద తీరుతూ సమయాన్ని చక్కగా ఆస్వాదిస్తూ గడిపారు.

కొత్తగా పెళ్లి అయిన జంటలకు కూడా మాల్దీవులు హనీమూన్ స్పాట్ గా మారిపోయింది.అయితే మాల్దీవులు వెళ్లాలనుకునే హైదరాబాద్ ప్రజలకు ఒక గుడ్ న్యూస్.

Advertisement

గో ఎయిర్ సంస్థ ట్విట్టర్ వేదికగా ఒక పోస్టును షేర్ చేసింది.

హైదరాబాద్ నుండి డైరెక్ట్ మాల్దీవులకు విమానాన్ని నడుపుతున్నట్లు గో ఎయిర్ సంస్థ తన పోస్టులో తెలియజేసింది.ఫిబ్రవరీ 11 నుండి హైదరాబాద్ టూ మాల్దీవులకు విమానాన్ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.సోమవారం, మంగళవారం, గురువారం, ఆదివారాల్లో హైదరాబాద్ నుండి మాల్దీవులలోని మాలే కు విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు.

నెక్ట్స్ జనరేషన్ ఎయిర్‌బస్ A320 నియో ఎయిర్‌క్రాఫ్ట్ ఈ సేవలను అందించనుంది.హైదరాబాద్ నుండి మాల్దీవులలోని మాలే కు వెళ్లే ప్రయాణికులకు అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నాం.తద్వారా ప్రయాణికులకు ఆనందదాయకంగా మరియు సౌకర్యంగా ఉంటుందని గో ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌశిక్ తెలిపారు.రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి G8 1533 విమానం ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు మాల్దీవుల్లోని వెలానా అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకుంటుంది.తర్వాత మాల్దీవులలో మాలే నుండి G8 4033 ఫ్లైట్‌ మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది.అంతేకాదు గో ఎయిర్ సంస్థ మాల్దీవులలో మాలే నుండి ముంబై, ఢిల్లీ, బెంగుళూరు సిటీలకు కూడా డైరెక్ట్ విమానాలు నడుపుతుంది.

వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు