జీమెయిల్ వెబ్‌ వెర్షన్‌కు న్యూ ఫీచర్స్.. ఇకపై అవన్నీ సులభం!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది రొటీన్ లైఫ్ లో జీమెయిల్ ఒక భాగమైపోయింది.

గూగుల్ సంస్థ తన యూజర్ల కోసం మరింత మెరుగైన సేవలను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలో జీమెయిల్ ప్లాట్‌ఫాం ద్వారా వేగంగా ఈమెయిల్స్ పంపించేందుకు సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చింది.ఆ ఫీచర్స్ ఏవో తెలుసుకుందాం.1.ఈమెయిల్ పంపడం సులభం ఈమెయిల్ కంపోజ్ చేసే సమయంలో కీబోర్టులో ఆల్ట్ ప్లస్ (ALT plus)పై క్లిక్ చేస్తే.మీ కాంటాక్ట్స్ లిస్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

అందులో మీరు ఎవరికి ఈ-మెయిల్ పంపించదలుచుకున్నారో ఆ ఐడీని సెలెక్ట్ చేసుకోవచ్చు.

2.ఈమెయిల్ ఐడీ నేమ్ చేంజ్ చేయవచ్చు మీరు ఈమెయిల్ పంపించే అవతలి వ్యక్తికి మీ మెయిల్ ఐడీ ఎలా కనిపించాలో నిర్ణయం తీసుకోవచ్చు.ఒకవేళ మీరు మీ ఈమెయిల్ ఐడీ అవతలి వ్యక్తికి ఫ్రెండ్ లేదా ఓనర్ ఇలా కనిపించాలంటే మీరు మీ ఐడీ నేమ్ ని చేంజ్ చేసుకోవచ్చు.

Advertisement

ఇలా చేయడం వల్ల అవతలి వ్యక్తికి మీరు పంపించిన ఈ-మెయిల్ ను గుర్తించడం సులభమవుతుంది.అయితే మీరు ఐడీ నేమ్ చేంజ్ చేసినా ఐడీ అడ్రస్ ఎలాంటి మార్పులకు గురి కాదు.సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ ఐడీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు.3.రంగులతో అలర్ట్​.

మీరు ఇప్పటికే ఒక జీమెయిల్ ఐడీతో సమాచారం పంచుకున్నట్లయితే.తదుపరి సారి ఆ జీమెయిల్ ఐడీ నుంచి వచ్చే ఈమెయిల్ పసుపుపచ్చ కలర్ లో మీకు కనిపిస్తుంది.

కొత్త జీమెయిల్ ఐడీ మాత్రం వేరే రంగులో హైలెట్ అవుతుంది.తద్వారా మీరు కొత్త పాట ఈ మెయిల్స్ ని వెంటనే గుర్తించవచ్చు.

ఈ సరికొత్త ఫీచర్లు అక్టోబరు 20 నుంచి గూగుల్ వర్క్ స్పేస్, జీసూట్ బేసిక్, బిజినెస్ యూజర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు