మరికొన్ని సంవత్సరాల తర్వాత కాఫీ ఉండక పోవచ్చు.. ఎందుకంటే?

ఉదయం లేచిన వెంటనే కాఫీ లేదా టీ తాగితేనే మనం పనులు ప్రారంభిస్తాం.సాదారణ జనాలు టీ ఎక్కువ తాగుతారు.

అయితే కొందరు ప్రముఖులు మరియు ఉన్నత శ్రేణి వారు మాత్రం కాఫీ తాగుతారు.కాఫీ కాస్త ఖరీదు అయినా దాని వల్ల ఉపయోగాల కారణంగా ఎక్కువగా కాఫీ తాగేందుకు ఆసక్తి చూపుతారు.

ప్రస్తుతం టీతో పోల్చితే కాఫీకి ఎక్కువ రేటు ఉంటుంది.కాఫీ తాగడం వల్ల ఆరోగ్యంకు మంచిది మరియు రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండవచ్చు అనే ఉద్దేశ్యంతో కాఫీ తాగేందుకు ఆసక్తి చూపిస్తారు.

అయితే రాబోయే కాలంలో కాఫీ లభించడం కష్టంగా మారేలా ఉంది.కాఫీ పంట చాలా అరుదైన వాతావరణంలో మాత్రమే పెరుగుతుంది.

Advertisement

అత్యంత వేడి ఉన్నా, అత్యంత చలి ప్రాంతాల్లో కూడా కాఫీ తోటలు సాగు చేయడం సాధ్యం కాదు.ప్రస్తుతం పలు ప్రాంతాల్లో కాఫీ తోటలు ఉన్నాయి.10 సంవత్సరాల క్రితంకు ఇప్పుడు పోల్చితే కాఫీ తోటలు దాదాపు 20 శాతం తగ్గాయి.వాతావరణ ప్రతికూలతలు మరియు ఇతరత్ర కారణాల వల్ల కాఫీ పంట దిగుబడి లేకపోవడంతో కాఫీ పంటలను వేసేందుకు రైతులు ఆసక్తి చూడం లేదు.

ఆసియాలోని పలు దేశాల్లో ప్రస్తుతం కాఫీ పంట సాగు అవుతుంది.కాఫీ పంట సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నా వాతావరణం ప్రతికూలంగా ఉంటున్న కారణంగా పండించలేక పోతున్నారు.

ప్రస్తుతం ఉన్న తోటల విస్తీర్ణం కూడా భారీ ఎత్తున తగ్గే అవకాశం ఉందని, గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం వల్ల కాఫీ పంటలు తగ్గుతున్నాయి అంటూ శాస్త్రవేత్తలు అంటూన్నారు.2050 వరకు కాఫీ తోటలు 10 శాతంకు తగ్గే అవకాశం ఉందని, అప్పుడు మంచి కాఫీ దొరకడం కష్టం అని, ఒక వేళ దొరికినా అది కొనడం సామాన్యులకే కాదు, ఉన్నత శ్రేణి వారికి కూడా కష్టమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.ప్రత్యామ్నాం ఏమైనా చూడకుంటే మాత్రం పెద్ద ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.

కృత్రిమ కాఫీని పండించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు