స్కూల్‌కి వెళ్లే పిల్ల‌ల‌కు పాలు కాదు.. ఈ డ్రింక్‌ను ఇస్తే మ‌స్తు బెనిఫిట్స్‌!

స్కూల్ కి వెళ్లే పిల్ల‌ల‌కు ఉద‌యం గ్లాస్ పాలు, ఏదో ఒక బ్రేక్ ఫాస్ట్‌ను త‌ప్ప‌కుండా ఇస్తుంటారు.ఒక‌వేళ పిల్ల‌లు బ్రేక్ పాస్ట్‌ను స్కిప్‌ చేసినా.

వారి చేత ఖ‌చ్చితంగా పాల‌ను తాగిస్తుంటారు.అయితే పాల కంటే ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్ మీ పిల్ల‌ల‌కు మ‌రింత శ‌క్తిని అందిస్తుంది.

అలాగే మ‌రెన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ డ్రింక్ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? అస‌లు ఆ డ్రింక్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి బినిఫిట్స్ ల‌భిస్తాయి.? వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక గిన్నెలో ప‌దిహేను న‌ల్ల ఎండు ద్రాక్ష‌లు, ఐదు జీడి ప‌ప్పులు, నాలుగు పొట్టు తొల‌గించిన బాదం ప‌ప్పులు, ఒక గ్లాస్ కాచి చ‌ల్లార్చిన పాలు వేసుకుని బాగా క‌లిపి నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే బ్లెండ‌ర్‌లో నాన‌బెట్టుకున్న ఎండు ద్రాక్ష‌లు, బాదం ప‌ప్పులు, జీడి ప‌ప్పుల‌ను పాల‌తో స‌హా వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.చివ‌ర్లో వ‌న్ టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ సిద్ధం అయిన‌ట్లే.

Advertisement

స్కూల్‌కి వెళ్లే పిల్ల‌ల‌కు పాలు కాదు.ఈ డ్రింక్‌ను ఇస్తే మ‌స్తు బెనిఫిట్స్ ల‌భిస్తాయి.ముఖ్యంగా పిల్ల‌లు రోజంతా హుషారుగా ఉండ‌టానికి కావాల్సిన శ‌క్తి వారి శ‌రీరానికి ల‌భిస్తుంది.

పిల్ల‌ల మెద‌డు చురుగ్గా ప‌ని చేస్తుంది.ఆలోచనా శక్తి, ఏకాగ్ర‌త రెట్టింపు అవుతాయి.

అలాగే పిల్ల‌ల్లో ర‌క్త‌హీన‌త అనేది చాలా కామ‌న్‌గా క‌నిపిస్తుంటుంది.

అయితే ర‌క్త‌హీన‌త‌కు చెక్ పెట్ట‌డంలో పైన చెప్పిన డ్రింక్ గ్రేట్ గా స‌హాయ‌ప‌డుతుంది.రోజూ ఉద‌యం పిల్ల‌ల చేత ఈ డ్రింక్ ను తాగిస్తే.ర‌క్త‌హీన‌త వారి దాపుల్లోకి కూడా రాకుండా ఉంటుంది.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

అంతేకాదు, పిల్ల‌ల ఎముక‌లు దృఢంగా పెరుగుతాయి.వారి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.

Advertisement

మ‌రియు పిల్ల‌లు అన్ని విధాలుగా స‌రిగ్గా ఎదిగేందుకు ఈ డ్రింక్ అద్భుతంగా తోడ్ప‌డుతుంది.

తాజా వార్తలు