చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో గీతా జ్ఞాన యజ్ఞం

రాజన్న సిరిసిల్ల జిల్లా: సత్పవర్తన, జ్ఞాన బుద్ది, క్రమశిక్షణ, ధైర్యం, సమయ స్ఫూర్తి మొదలైనవి భగవత్గీత ప్రతి రోజు పటిస్తే మనకు అలవాడతాయని యజ్ఞానంద స్వామి ప్రభోదించారు.

స్థానిక బి వై నగర్ హనుమాన్ దేవాలయం లో గత నాలుగు రోజులుగా చిన్మయ మిషన్ నిర్వహిస్తున్న జ్ఞాన యజ్ఞం లో జగదేవపూర్ నుండి విచ్చేసిన యజ్ఞానంద భగవత్గీత, భజగోవిందం ల పై ప్రవచనంలను బోధిస్తున్నారు.

వీటి లోని సారాంశాన్ని ప్రతి ఒక్కరు వారి జీవితానికి ఆపదించుకోవాలన్నారు.జీవితాలు బాగు పడి,మంచి భవిష్యత్ ఏర్పడుతుందని అన్నారు.

ఈ జ్ఞాన యజ్ఞం ఆదివారం రోజున ముగుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూవినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ ప్రతినిధులు సజ్జనం శ్రీనివాస్,మోతిలాల్, నల్ల సత్యనారాయణ,గజ్జెల్లి రాంచంద్రం,మెరుగు మల్లేశం, కమలాకర్,కోటేశ్వరి,సృజన, రాజమణి,ప్రమీల,లత,అరుణ, జయ,రాజేశం తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News