ఫ్లాప్ డైరెక్టర్ తో పెద్ద సాహసం చేస్తున్న గీత ఆర్ట్స్ 2?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థలలో ఒకటిగా పేరు సంపాదించుకున్న నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ ఒకటి.ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా వస్తుంది అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పక్క హిట్ అవుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంది.

 Gita Arts 2 Doing A Big Adventure With Flop Director Details, Gita Arts 2, Tolly-TeluguStop.com

ఎన్నో సంవత్సరాలుగా ఈ బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ప్రస్తుతం ఈ బ్యానర్ అనుబంధ సంస్థ గీతా ఆర్ట్స్ 2 పిక్చర్ బ్యానర్ పై బన్నీ వాసు చిత్రాలను నిర్మిస్తున్నారు.

ఈ బ్యానర్ లో బన్నీ వాసు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.అయితే ఈ బ్యానర్లు బడా బడ్జెట్ చిత్రాల నుంచి మీడియం రేంజ్ సినిమాలు కూడా తెరకెక్కుతూ మంచి హిట్ అందుకున్నాయి.

తాజాగా ఈ బ్యానర్ లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా విడుదలకు సిద్ధం కాగా, ఈ బ్యానర్ లో మరో సినిమాకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది.అయితే జోహార్, అర్జున పాల్గుణ చిత్రాలతో దర్శకుడిగా పరిచయమైన తేజ మర్ని డైరక్షన్ లో బన్నీ వాస్ – విద్య మాధురి నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

Telugu Allu Aravind, Tejamarni, Gita, Bunny Vasu, Srikanth, Telugu, Tollywood-Mo

జోహార్, అర్జున ఫాల్గుణ వంటి సినిమాలతో డిజాస్టర్ ఎదుర్కొన్న డైరెక్టర్ కు అవకాశం కల్పిస్తూ పెద్ద సాహసం చేస్తున్నారని చెప్పాలి.తాజాగా ఈ సినిమా గీతా ఆర్ట్స్2 లో ‘ప్రొడక్షన్ నెంబర్ 8’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.అయితే తేజమర్ని దర్శకత్వంలో వచ్చిన సినిమాలను దృష్టిలో పెట్టుకోకుండా, కంటెంట్ దృష్టిలో పెట్టుకొని ఈ బ్యానర్లో అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో శ్రీకాంత్ – వరలక్ష్మి శరత్ కుమార్ – రాహుల్ విజయ్ – శివాని రాజశేఖర్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube