పెళ్లి చేసుకుని 'ఉగ్రవాది' అవుతా

ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత హనీ మూన్ కో, లేక బంధువుల ఇంటికొ వెళ్తారు.కానీ మలేసియాకు చెందిన ఒక అమ్మాయి భయంకరమైన నిర్ణయం తీసుకుంది.

అసలు కధలోకి వెళితే.14 ఏళ్ల మైనర్ బాలిక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక స్టేట్ టెర్రర్ గ్రూపులో చేరేందుకు సిద్ధమవుతూ మలేషియా పోలీసులకు చిక్కింది.మంగళవారం మలేషియాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దక్షిణ మలేషియాలోని మువర్‌కు చెందిన ఆ బాలిక ఐసీస్‌లో చేరేందుకు కౌలా లాంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కైరో విమానం ఎక్కేందుకు బోర్డింగ్‌లో వేచి ఉండగా స్పెషల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు.ఇన్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు టాన్ శ్రీ ఖలిద్ అబు బాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మలేషియాకు చెందిన 22 ఏళ్ల యువకుడిని కైరోలో ఆ బాలిక పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడిందని, అనంతరం వారిద్దరూ కలిసి ఐసీస్‌లో చేరేందుకు సన్నధ్ధమైనట్లు తెలిపారు.తొలుత టర్కీ రాజధాని ఇస్తాంబుల్ చేరుకుని ఆ తర్వాత సిరియా వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే సిరియాలో ఉంటున్న ఇద్దరు మలేషియన్ మిలిటెంట్లతో ఆ యువతి టచ్‌లో ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం ఆ బాలికను సెక్యూరిటీ నేరాలు చట్టం 2012 కింద అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.

Advertisement

ఇంటిలిజెన్స్ నివేదిక ప్రకారం బాలిక పెళ్లాడదామనుకున్న వ్యక్తి కైరోలోని ఆల్ అజహార్.ఏది ఏమైనా ఉగ్రవాదం యువతపై తీవ్రమైన టార్గెట్ చేస్తుంది అనడానికి ఇది మరో నిదర్శనం.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు